Prabhas: మలయాళ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. ఇక రచ్చ రచ్చేనా.?
Prabhas: ప్రభాస్ ఒకప్పుడు ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది అవమానపరిచారు.. వీడి మొహానికి హీరో అవుతాడా అంటూ హేళన చేశారు.. అలా అవమానాల స్థాయి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు ప్రభాస్. ఆయన ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలెంట్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారు. అలాంటి ప్రభాస్ తో ఒక్క సినిమాలో ఛాన్స్ దొరికిన చాలు అంటూ ఎంతో మంది హీరోయిన్లు ఇతర నటీనటులు ఎదురు చూస్తూనే ఉంటారు..
Prabhas romance with Malayalam beauty
అలా వరుసగా పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్న ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో సాగినటువంటి కథ ఆధారంగా ఈ సినిమాను తీస్తారట. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించబోతున్నారని ఇప్పటికే యుద్ధాలకు సంబంధించిన భారీ యాక్షన్స్ సన్నివేశాలకు సంబంధించి అన్ని రకాల ప్లాన్ చేసుకున్నారని సమాచారం.(Prabhas)
Also Read: Devara sequel: పుష్ప స్ట్రాటజీ దేవర కి వర్క్ అవుట్ అయ్యేనా.. పులి నక్క వాత పెట్టుకున్నట్లు!!
ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రంలో ఒక మలయాళ బ్యూటీ రాబోతోందని ఆమెతో ప్రభాస్ విపరీతంగా రొమాన్స్ చేయబోతున్నారని ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. అయితే ఈ మలయాళ అమ్మడు ఎవరు అనేది ఇప్పటివరకు బయట పెట్టలేదు కానీ ప్రభాస్ తో ఈమెకు కీలకమైన రోల్ ఉండనుందని సమాచారం.
ఒకవేళ అన్ని ఓకే అయి ఆ బ్యూటీ ప్రభాస్ తో నటించింది అంటే తప్పకుండా ఆమె కెరియర్ మారిపోయినట్టే.. మరి చూడాలి ఈ అమ్మడు ప్రభాస్ తో చాన్స్ కొట్టేస్తుందా లేదంటే ఆ ప్లేస్ లో మరో అమ్మాయిని తీసుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఫౌజీ సినిమా కోసం హైదరాబాదులో ఇప్పటికే షూటింగ్ సెట్లు ఏర్పాటు చేసి పలు కీలకమైన ఫైట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.(Prabhas)