Prabhas: హీరోలంతా కుర్చీపై.. ప్రభాస్ మాత్రం నేలపై.. ఈ స్టోరీ మీకు తెలుసా..?
Prabhas: సాధారణంగా పూర్వకాలంలో రాజ వంశానికి చెందినటువంటి చాలామంది రాజులు విలాసంతమైన జీవితాలను అనుభవించేవారు.. అయితే అలా అందరూ రాజులు ఉండేవారు కాదు.. కొంతమంది రాజులు ఎంత ధనవంతులైనా సరే ప్రజల కోసం పరితపించి ప్రజల తోటి జీవించేవారు.. అలా రాజ వంశానికి చెందినటువంటి ఫ్యామిలీలో పుట్టిన హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు.. ఆయన అంతటి స్థానంలో ఉన్నా కానీ చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ వస్తారట.. ప్రస్తుతం ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు..

Prabhas True Nature
ఆయన డేట్స్ కోసం దేశవ్యాప్తంగా దర్శక నిర్మాతలు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి ప్రభాస్ ను ఒక డైరెక్టర్ నేల మీద కూర్చోబెట్టి ఇడ్లీలు తినిపించారట. దీనికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు.. ఈయన దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా చేసినటువంటి ‘బుడ్డా హోగా తేరి బాప్’ అనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ నిర్వహించారట పూరి జగన్నాథ్. దీనికోసం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు పార్టీ ఇచ్చారట. (Prabhas)
Also Read: Prabhas upcoming movies: ప్రభాస్ సినిమాల లైనప్ సెట్ అయినట్లే.. ఆ మాస్ యాక్షన్ మరింత వెనక్కి!!
ఈ పార్టీకి చాలామంది హీరోలను ఆహ్వానించడమే కాకుండా ప్రభాస్ ను కూడా ప్రత్యేకంగా రావాలని ఆహ్వానం పలికారట.. దీంతో ప్రభాస్ కూడా పార్టీకి వెళ్లి కాసేపు గడిపి నేను వెళ్తాను డార్లింగ్ అని పూరికి చెప్పారట.. దీంతో పూరి జగన్నాథ్ లేదు లేదు ఇక్కడ రోడ్ సైడ్ ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ చాలా అద్భుతంగా ఉంటాయి అవి నువ్వు టేస్ట్ చేసే వెళ్లాలి అని అన్నారట.. వెంటనే ఆ ఇడ్లీలను పూరి జగన్నాథ్ తీసుకువచ్చి అక్కడ ఉన్న హీరోలందరికీ ఇచ్చి ప్రభాస్ కూడా ఇచ్చారట.. అయితే అప్పటికే ఉన్నటువంటి సోఫాల్లో హీరోలంతా కూర్చొని ఉన్నారట. బాస్ కూర్చోడానికి కనీసం ప్లేస్ కూడా లేదట..

దీంతో ఇడ్లీలు ఇవ్వగానే వారంతా కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుని తింటుంటే ప్రభాస్ మాత్రం ఆ ఇడ్లీలు తీసుకొని నేలపై ఎంచక్కా కూర్చొని తిన్నారట.. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారట.. వెంటనే పూరి జగన్నాథ్ కుర్చీ తీసుకురమ్మని అన్నారట.. కానీ ప్రభాస్ మాత్రం నాకు నేల మీదే కంఫర్ట్ గా ఉంది డార్లింగ్ కుర్చీ ఏమీ వద్దు నాకు సోఫాపై కుర్చీ పై కూర్చొని తినాలని ఏమీ లేదు అని చాలా సింపుల్గా సమాధానం ఇచ్చారట. ఒకవేళ ఇదే ప్లేస్ లో ఇంకో హీరో కనుక ఉండి ఉంటే మాత్రం చాలా రచ్చ రచ్చ అయి ఉండేదని, ప్రభాస్ కాబట్టి ఓపికతో ఉన్నారని పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Prabhas)