Prema: ఆ డైరెక్టర్ నా జీవితం సర్వనాశనం చేశాడు.?

Prema: సీనియర్ నటి ప్రేమ అంటే తెలియని వారు ఉండరు.ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ కూడా టీవీలలో వస్తాయి.అలా హీరోయిన్ గా మొదలుపెట్టిన ప్రేమ ప్రస్థానం చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..విలన్ గా.. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది. అయితే హీరోయిన్గా వచ్చి ఎప్పటికి హీరోయిన్ గానే ఉండిపోతాను అని ప్రేమ అనుకునేదట. కానీ ఓ డైరెక్టర్ వల్లే ప్రేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చిందట.
Prema shocking comments on that director
మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే త్రివిక్రమ్.. కొంతమంది హీరోయిన్లు డైరెక్టర్ చెప్పే విషయాన్ని గుడ్డిగా నమ్మి కథ అంతగా తెలుసుకోకముందే సినిమాకి ఓకే చెప్పి తీరా సినిమా విడుదలయ్యాక తమ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదని ఆ సినిమా వల్లే మాకు హీరొయిన్ అవకాశాలు రాకుండా పోయాయని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు కొన్ని ఇంటర్వ్యూలలో మొరపెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. (Prema)
Also Read: Rashmika: తన ఛాన్స్ కొట్టేసిందని ఆ హీరోయిన్ పై అసూయపడ్డ రష్మిక.?
అయితే ఇలాంటి ఓ విషయాన్ని నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రేమ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రివిక్రమ్ వల్లే నాకు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు తగ్గాయి. చిరునవ్వుతో మూవీలో త్రివిక్రమ్ నాకు హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పి మీరు ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పి చివరికి ఆ సినిమాలో నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చేశాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ వేరే ఉంది.

కానీ ఆ విషయం తెలియక నేనే హీరోయిన్ అనుకొని ఆ సినిమాకి ఓకే చెప్పాను. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే నా పాత్ర ఏంటో అర్థం అయింది.ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత నాకు అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశాలే వచ్చాయి. దాంతో హీరోయిన్గా చేసిన జీవితం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి పరిమితం అవ్వాల్సి వచ్చింది.అలా త్రివిక్రమ్ చెప్పిన మాట వినడం వల్ల నా జీవితం సర్వనాశనం అయ్యింది అంటూ నటి ప్రేమ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.(Prema)