Premistava Trailer: ‘పంజా’ డైరెక్టర్ సరికొత్త సినిమా.. లవ్ ఎమోషనల్ ‘ ప్రేమిస్తావా’!!
Premistava Trailer: కోలీవుడ్‌లో తన ప్రత్యేకమైన మార్క్ నెలకొల్పిన టాలెంటెడ్ దర్శకుడు విష్ణువర్ధన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “పంజా” ద్వారా పవన్ కళ్యాణ్‌తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు “ప్రేమిస్తావా” అనే రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు.
Premistava Trailer Impresses with Romantic Elements
యంగ్ హీరో ఆకాష్ మురళి మరియు హీరోయిన్ అదితి శంకర్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ అనూహ్య స్పందన తెచ్చుకుంటూ, విష్ణువర్ధన్ మార్క్ టేకింగ్‌తో పాటు ఆయన సినిమాల్లో కనిపించే ఫ్రెష్ నెస్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ ట్రైలర్ కథలో ప్రధానంగా రొమాంటిక్ లవ్ యాంగిల్‌తో పాటు బ్రేకప్‌లాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కెమెరామెన్ ఎరిక్ బ్రైసన్ విజువల్స్ ఎంతో ఇంప్రెసివ్‌గా ఉండగా, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా “పంజా” తర్వాత మరోసారి సెన్సేషనల్ స్కోర్ అందించారని చెప్పాలి. ట్రైలర్ విజువల్స్, సంగీతం, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. దర్శకుడు విష్ణువర్ధన్ తన స్టైల్, మ్యాజిక్‌ను ఈ సినిమాలో మరోసారి చూపించబోతున్నారని అనిపిస్తోంది.
తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు విడుదల చేయనున్నారు. సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ అందించిన హైప్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.