Prithviraj Sukumaran: రజినీకాంత్ ను కథ తో మెప్పించలేకపోయా – పృథ్వి రాజ్ సుకుమారన్
Prithviraj Sukumaran: టాలీవుడ్ లో స్టార్ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ తో కలిసి ‘లూసిఫర్’ సీక్వెల్ ‘L2: ఎంపురాన్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ గా విడుదల చేయగా దానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తన జీవితంలోని ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు.
Prithviraj Sukumaran incident with Rajinikanth
ఒకప్పటి సంగతి గుర్తుచేసుకుంటూ, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా దర్శకత్వం వహించమని తనను సంప్రదించిందని పృథ్వీరాజ్ తెలిపారు. ఇది తనలాంటి యువ దర్శకుడికి గొప్ప అవకాశమని, అంతేకాకుండా తన కల కూడా అని ఆయన అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా కార్యరూపం దాల్చలేకపోయింది.
అందుకు గల కారణాన్ని వివరిస్తూ, నిర్మాణ సంస్థకు నచ్చేలా ఒక అద్భుతమైన కథను ఆ సమయంలో తాను రూపొందించలేకపోయానని పృథ్వీరాజ్ వెల్లడించారు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం చేజారడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనైనా రజనీకాంత్, పృథ్వీరాజ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ‘లూసి22: ఎంపురాన్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.