Priyamani: ప్రెగ్నెన్సీపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్.. అందుకే పిల్లల్ని కనడం లేదా.?
Priyamani: సీనియర్ నటి ప్రియమణి పెళ్లయి ఇన్ని సంవత్సరలైనా కూడా ఇంకా పిల్లల్ని కనకపోవడంతో చాలామంది ఈమెపై చాలా రకాల ఆరోపణలు చేశారు. కొంతమంది అందం కోసం పిల్లలే కనడం లేదని అంటే మరికొంతమంది పిల్లలు పుడితే ఎక్కడ తనకు సినిమా అవకాశాలు కరువైపోతాయోనని పిల్లలకు ప్లాన్ చేసుకోవడంలేదని,ఇంకొంతమంది ప్రియమణికి అసలు పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీసేసుకుందని ఇలా ఎవరికి తోచిన కామెంట్లు

Priyamani shocking comments on pregnancy
వాళ్ళు చేస్తూ ప్రియమణి పర్సనల్ లైఫ్ పై చాలా ఆరో పనులు చేశారు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తనకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతూ.. నేను ముస్తఫా రాజ్ ని ప్రేమించిన సమయంలో మా ఇంట్లో వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినప్పటికీ ఆ తర్వాత ఓకే చేశారు.అయితే ముస్తఫా తో ఎంగేజ్మెంట్ అయ్యాక మా ఫ్యామిలీ సంతోషిస్తుంది అని అనుకున్నాను.కానీ చాలామంది అప్పటినుండి నాపై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.(Priyamani)
Also Read: Tamannaah: సల్మాన్ ఖాన్ తో తమన్నా హాట్ రొమాన్స్.. ప్రియుడిని వదిలేసిందా.?
ముఖ్యంగా మా ఆయన ముస్లిం నేను హిందూ కావడంతో ఎంతోమంది మీకు ఇద్దరికీ పిల్లలు పుట్టాక ఉగ్రవాదుల సంస్థలో చేర్పించండి.. టెర్రరిస్టులుగా మార్చండి.. లవ్ జిహాది అంటూ ఎంతోమంది నాకు పుట్టబోయే పిల్లల గురించి కామెంట్లు చేశారు. ఇక వారి కామెంట్స్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేనేమీ తప్పు చేయలేదు కదా.. ఎంతోమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు.

మతం గురించి నేను అస్సలు ఆలోచించను. కానీ వీళ్ళ సూటిపోటి మాటలతో నేను చాలా బాధపడ్డాను.ఇంకా పుట్టని పిల్లలపై అలాంటి కామెంట్లు చేయడం నా మనసుకు బాధనిపించింది.. అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇక ప్రియమణి మాటలు వైరల్ అవ్వడంతో పిల్లలు పుడితే ఎక్కడ పిల్లలు కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందోనని బాధపడి ప్రియమణి ఇప్పుడే పిల్లల్ని కనడం లేదు కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.(Priyamani)