SSMB29 కోసం ప్రియాంక రెమ్యునరేషన్ అంతా ..?
SSMB29: టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ స్థాయి లో తెరకెక్కనుంది. SSMB29 చిత్రంలో మహేష్ బాబుని మరింత గొప్పచూపించాలని రాజమౌళి భావిస్తున్నారు.
Priyanka Chopra huge Remuneration for SSMB29
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రియాంక హైదరాబాద్ చేరుకుని, ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభించారు. అయితే, ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. SSMB29 సినిమా వంటి గ్రాండియర్ మూవీ కోసం ప్రియాంక చోప్రా రూ.20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కారణంగా ఈ భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఆమె పాత్ర ఏ విధంగా ఉండబోతుందో అనే దాని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ భారీ రెమ్యూనరేషన్ చెల్లిస్తే, ప్రియాంక టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలబడే అవకాశం ఉంది.
ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు, కానీ సోషల్ మీడియాలో దీనిపై చర్చలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఈ సినిమా మరింత హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.