Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును తప్పు చేసిన పంజాబ్ ?
Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును వదిలేసి పంజాబ్ కింగ్స్ పెద్ద తప్పిదమే చేసింది. తాజాగా.. అశుతోష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే… మనందరికీ ఇదే అనిపిస్తుంది. ఓడిపోతుందన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును… ఎంతో కష్టపడి విజయతీరాలకు చేర్చాడు అశుతోష్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Punjab Missed Ashutosh Sharma IPL 2025
Curry leaves: కరివేపాకు తింటే ఏం జరుగుతుంది.. ఉపయోగాలు ఇవే ?
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ చేదించింది. అయితే.. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ 31 బంతులు 66 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి.
Moong Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?
చివరలో సిక్సర్ తో మ్యాచ్ గెలిపించాడు అశుతోష్ శర్మ. అయితే మొదటి వరకు… పంజాబ్ కిమ్స్ కి ఆడాడు అశుతోష్ శర్మ. కానీ అతన్ని అనవసరంగా వదిలేసుకుంది పంజాబ్ కింగ్స్. వేలంలోకి రాగానే 3.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. దానికి న్యాయం చేస్తూ ఇప్పుడు… అశుతోష్ శర్మ భయంకరంగా ఆడుతున్నాడు.
Jamun Fruit: ఎండా కాలంలో నేరేడు పండ్లు తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి?