Pushpa-2: బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాక్..?

Pushpa -2: ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి చేసిన సినిమాలకే రికార్డుల మోత మోగడం చూసాం. కానీ ఆ స్థాయిలోకి డైరెక్టర్ సుకుమార్ కూడా వచ్చాడని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో అంచనాలను మించి రికార్డుల మోత మోగించాడు. దీనికి సీక్వెల్ గా పుష్ప2 భారీ హైప్ క్రియేట్ చేసింది. అంతేకాదు సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో చరిత్ర సృష్టించడమే కాకుండా రిలీజ్ మొదటి రోజే అద్భుతమైన వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది.
Pushpa -2 first day collections at the box office
ఈ విధంగా పుష్ప2 సినిమాపై అభిమానులకు ఉన్న అంచనాల ప్రకారం సినిమా ముందుకు వెళుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత కలెక్షన్స్ చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. పుష్ప మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, వంటి రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి వసూళ్లను సాధించిందట. (Pushpa -2)
Also Read: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!
పుష్ప 2 సినిమా చరిత్రలో ఏనాడు లేని విధంగా 617 కోట్ల బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియెట్రికల్ రైట్స్ కింద 425 కోట్లు, ఓటిటి దిగ్గజం 275 కోట్లతో డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఈ విధంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా గ్రాస్, 620 కోట్లకు పైగా షేర్ లక్ష్యంగా బరిలోకి వచ్చింది. అంతే కాదు గతంలో ఎప్పుడు కూడా లేనివిధంగా 11వేల స్క్రీన్ లలో పుష్ప2 సినిమాని రిలీజ్ చేశారు.

అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దుమ్ములేపిన ఈ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 184 కోట్లు, నైజాంలో 72 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 16, వెస్ట్ లో 12, వైజాగ్ లో 21, సీడెడ్ లో 26, నెల్లూరులో 8, గుంటూరు 17, కృష్ణా 12, కోట్ల వసూలు సాధించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్పా 2 మూవీ ఇదే ఊపుతో ముందుకు వెళ్తే మాత్రం ఆర్ఆర్ఆర్, బాహుబలి కలెక్షన్స్ కూడా ఈజీగా దాటేస్తుందని సినీ నిపుణులు అంటున్నారు.(Pushpa -2)