Pushpa2: పుష్ప 2 ఎవరికి అందని రికార్డులు సాధించిందిగా.. పుష్పరాజా మజాకా.!
Pushpa 2: 2023 లో అత్యంత అద్భుతమైన హిట్ సాధించిన చిత్రాలలో పుష్ప2 సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా రిలీజ్ అయిన మొదటి షోతోనే అద్భుతమైనటువంటి రికార్డులు కొల్లగొట్టినటువంటి ఈ చిత్రం ఇప్పటివరకు ఎంత సాధించింది.. ఏ ఏ చిత్రాలను దాటి టాప్ లెవల్లో నిలిచింది ఆ వివరాలు చూద్దాం..

Pushpa 2 has achieved records that no one has achieved
పుష్ప 2 ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లు చేపట్టినట్టు తెలుస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పుష్పా2 మూవీ 2,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందట. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో హైయెస్ట్ గ్రాస్ సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ విధంగా టాప్ లెవెల్ లో దూసుకుపోవడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ అభిమానులకు డబల్ బిరియాని తిన్నంత ఆనందం వేస్తోంది. (Pushpa 2)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి సంచలనం.. అప్పటివరకు అనుభవించాల్సిందే!!
అయితే ఇప్పటివరకు ఈ రికార్డులు బాహుబలి 2, దంగల్ చిత్రంపై ఉండేవి. బాహుబలి 1,810కోట్లు సాధిస్తే, దంగల్ 2,200 కోట్లకు దగ్గరకు వచ్చిందట. ఈ రికార్డులను చెరిపేసి పుష్పా2 చిత్రం 2,200 కోట్లు దాటి దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు తాజాగా ప్రకటించాయి.. దీంతో భారతీయ చలన చిత్రా రంగంలో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు చేసిన చిత్రంగా పుష్ప2 నిలిచిందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందార యాక్టింగ్ మరో లెవెల్ ఉందని చెప్పవచ్చు. ఈమె వల్ల కూడా ఈ సినిమాకి మరింత పేరు వచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో వీళ్లే కాకుండా ఫేమస్ ఉన్నట్లు అయినటువంటి జగపతిబాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, వంటి వారు చేశారు.(Pushpa 2)