Pushpa-2: 2 వేల కోట్లే టార్గెట్.. నేటి నుంచి థియేటర్లలో పుష్ప-2 మాస్ జాతర.?
Pushpa-2: 2024 చివరి నెలలో అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో పుష్ప2 ఒకటి. పోయిన ఏడాది ఏ చిత్రం కూడా పుష్ప2 సినిమాలు దాటి కలెక్షన్ చేయలేదు. ఆ విధంగా 2024లో సంచలన సృష్టించిన సినిమా ఏదయ్యా అంటే అది అల్లు అర్జున్ చిత్రం పుష్ప2 అని చెప్పకనే చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. ఇక ఆయన నటన గురించి ఒక్క మాటలో చెప్పలేం..
Pushpa-2 mass fair in theaters from today
అలా 2024, డిసెంబర్ 5వ తేదీన ఆల్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు చేపట్టి, అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేపట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అలాంటి పుష్పా2 మూవీకి, కేవలం అల్లు అర్జున్ నటనే కాకుండా నేషనల్ క్రష్ రష్మిక మందాన యాక్టింగ్ మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి మొదలు ఇప్పటివరకు కూడా ఇంకా చాలా థియేటర్లలో నడుస్తూనే ఉంది. (Pushpa-2)
Also Read: Prabhas: అర్ధరాత్రి ఆ హీరోయిన్ ప్రభాస్ టార్చర్ చేశారా.?
ఇప్పటివరకు 1800 కోట్లు కలెక్షన్స్ దాటిన ఈ సినిమాను 2000 కోట్లు దాటించాలని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారట. ఇదే తరుణంలో తాజాగా సినిమా రీలోడెడ్ వెర్షన్ ను ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీనికోసం ఇంతకుముందున్న సినిమా కాకుండా మరో 20 నిమిషాల పుటేజ్ ని అదనంగా యాడ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వారు ప్రకటించారు.
దీనివల్ల ఈ సినిమా రన్ టైం మూడు గంటల 40 నిమిషాలకు చేరుతుంది. 20 నిమిషాల సినిమా ఎక్కువ యాడ్ చేసిన తర్వాత దీని టికెట్టు ధరలు నైజాం సింగిల్ స్క్రీన్ లలో 112 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు ఉండనుంది. ఈ విధంగా 2000 కోట్లు టార్గెట్ గా చిత్ర యూనిట్ ముందుకు సాగుతోంది. మరి చూడాలి ఈ సినిమా వారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదంటే ఇంతటితోనే ఆగిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Pushpa-2)