Pushpa 2 movie: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?
Pushpa 2 movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం “పుష్ప 2” డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేసిన నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి.
Pushpa 2 movie Streaming on Netflix
“పుష్ప 2” బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇటీవలే ఈ సినిమాకు 20 నిమిషాల కొత్త ఫుటేజీని జోడించి “రీలోడెడ్ వెర్షన్” విడుదల చేశారు. ఈ వెర్షన్ కూడా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.
ఇప్పుడు, “పుష్ప 2” “రీలోడెడ్ వెర్షన్” ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 30న “పుష్ప 2” నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని వారు ప్రకటించారు. మరి “పుష్ప 2” ఓటీటీలో కూడా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ఏదేమైనా ప్రేక్షకులు ఈ వర్షన్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.