Pushpa 2 Premier Collections: అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Pushpa 2 Premier Collections: అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి పరిశ్రమలో అంచనాలను పెంచింది. ముఖ్యంగా భారతదేశంలో రూ.70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషంగా నిలిచింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడవ్వడంతో ఈ సినిమా కొత్త రికార్డును నెలకొల్పింది.
Pushpa 2 Premier Collections
డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ ద్వారా ఈ చిత్రం రూ.7 కోట్లు వసూలు చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ప్రీమియర్ కలెక్షన్లను కలిపి రూ.77 కోట్ల ప్రీ-సేల్స్ సాధించడం గమనార్హం. ఇందులో హిందీ వెర్షన్ రూ.27.12 కోట్లు, తెలుగు 2డీ వెర్షన్ రూ.38.37 కోట్ల వసూళ్లు చేశాయి. ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ Sacnilk ప్రకారం, డిసెంబర్ 4న జరిగిన ప్రీమియర్స్ ద్వారా సినిమా ఇండియాలోనే రూ.16.03 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని వెల్లడించారు.
Also Read: Tarun Adarsh Praises Pushpa2: పుష్ప మూవీ బాలీవూడ్ రివ్యూ..పూనకాలు ఖాయం!!
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ.8 కోట్ల మేర కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఓవర్సీస్‌లో రూ.62 నుండి రూ.72 కోట్లు వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.250-300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు RRR (2022) రూ.223 కోట్లతో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమా. ఇప్పుడు పుష్ప 2 ఈ రికార్డును అధిగమించి, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం రాయబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి పుష్ప 2 ఫస్ట్ డే బాక్సాఫీస్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం!