Pushpa 2 Movie Review: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

మూవీ: Pushpa 2 Movie
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫాహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ,జగదీష్ తదితరులు
ఎడిటర్: నవీన్ నూలీ
సినిమాటోగ్రాఫర్ : మీరోస్లావ్ కూబా బ్రజక్
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచలి
మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్
రిలీజ్ డేట్: 05 డిసెంబర్ 2024

Pushpa 2 Movie Review and Rating

నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప 2: ది రూల్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా “బాహుబలి 2” తర్వాత అంతటి ఆసక్తి రేకెత్తించిన సీక్వెల్ కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప తొలి భాగం విపరీతమైన విజయాన్ని సాధించడంతో, సీక్వెల్ ఎలా ఉండబోతోందోనన్న క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఎదురుచూశారు. మరి ఎన్నో అంచనాలను రేపుతున్న ఈ సినిమా ఏస్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

Pushpa-2 must be watched for these 5 reasons

కథ: ఎర్రచందనం సిండికేట్ ను సోలోగా నిర్వహిస్తున్న పుష్పరాజ్ (అల్లు అర్జున్) త భార్య శ్రీవల్లి (రష్మిక మందన్న) కోరికమేరకు ముఖ్యమంత్రి తో ఫోటో దిగేందుకు సిద్ధప్ప (రావు రమేష్) తో కలిసి వెళతాడు. అక్కడ పుష్ప కు జరిగిన అవమానం తట్టుకోలేక రాష్ట్ర రాజకీయాలనే మార్చి తాను శాసించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో పుష్ప ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎప్పటినుంచో చూస్తున్నా షెకావత్ (ఫహద్ ఫాజిల్) కి పుష్ప దొరుకుతాడా.. తన భార్య కోరికను పుష్ప ఎలా తీరుస్తాడనేదే ఈ సినిమా కథ.

నటీనటులు: “పుష్ప 2”లో మరోసారి అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. పార్ట్ 1లో అద్భుతంగా నటించిన బన్నీ, ఈసారి దాన్ని మించిన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. పుష్ప పార్ట్ 1కు నేషనల్ అవార్డు రావడం పట్ల కొందరు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ సీక్వెల్‌లో తన నటనతో అలాంటి విమర్శకులను తిప్పి కొట్టేలా చేశాడు. “పుష్ప 2”లో ఆయన నటనకు మళ్ళీ నేషనల్ అవార్డు కచ్చితంగా రావాల్సిందే అనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. రష్మిక నటన గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఆమె శ్రీవల్లి పాత్రలో మునుపటికంటే బాగా నటించింది. రొమాన్స్, ఎమోషన్ రెండింటినీ సమపాళ్లలో మిళితం చేసి, మంచి భార్యగా పుష్పకు అండగా నిలిచింది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ తనదైన ముద్రవేసాడు. అల్లరి పోలీస్ గా తనదైన శైలిలో మెప్పించాడు. రావు రమేష్ సిద్దప్పగా మరింత ప్రభావం చూపించాడు. అజయ్ కూతురిగా నటించిన పావని పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్పలత, బ్రహ్మాజీ, జగపతిబాబు, జగదీశ్, ఆదిత్య మీనన్, శ్రీతేజ్ తదితరులు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. తన స్పెషల్ సాంగ్‌తో శ్రీలీల ప్రేక్షకులను అలరించింది.

సాంకేతిక నిపుణులు: సుకుమార్ తన మార్క్ దర్శ ప్రతిభను మరోసారి ఈ సినిమాతో నిరూపించుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో పాటు ఇతర పాత్రలకు కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తూ అయన కథ, కథనాలు రాసిన విధానం బాగుంది. ఎమోషన్స్‌కు బాగా జస్టిఫికేషన్ ఇస్తూ, ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. జాతర,క్లైమాక్స్ ఎపిసోడ్ లలో ఆయన రాసిన మాటలు బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. అల్లు అర్జున్‌ను దర్శకుడు సుకుమార్ ఈ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థం అవుతుంది. అల్లు అర్జున్ ను చూపించే విధానం కూడా అదిరిపోయింది. ఆయన్ను మరింత స్టైలిష్‌గా చూపిస్తూ, ఆయన మార్క్ గెస్చర్స్, మ్యానరిజాన్ని హైలైట్ చేశారు దర్శకుడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాలో మరో హైలైట్. పాటలు మాత్రమే కాదు, నేపథ్య సంగీతం కూడా థియేటర్లలో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. “జాతర” సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. “పుష్ప 2”లో నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో కనిపించాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా గ్రాండియర్ ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

అల్లు అర్జున్ నటన

సంగీతం

అల్లు అర్జున్, రష్మిక మధ్య కెమిస్ట్రీ

మైనస్ పాయింట్స్:

తొలి భాగం అక్కడక్కడా పీలగా అనిపించడం

తీర్పు: మొత్తానికి, సినిమా గొప్ప ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులను అలరించడం ఖాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, నటీనటుల నటనతో ఈ సినిమా ప్రేక్షకులను మరింత ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పర్ఫామెన్స్, ఎలివేషన్స్, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని బలహీనతలు ఉన్నా సుకుమార్ టేకింగ్ సినిమా అంచనాలకు మించి మాస్ ట్రీట్ అందించింది. బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే స్థాయిలో సినిమా ఉంది.

రేటింగ్: 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *