Pushpa 2: అస్సలు తగ్గేదెలే..భారీ రేంజ్ లో దూసుకుపోతున్న ‘పుష్ప2’ కలెక్షన్స్!!
Pushpa 2: ‘పుష్ప: ద రూల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే 1700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా తెలుగు సినిమాలకు ఇది గొప్ప గర్వకారణంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం బుక్‌మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. అల్లు అర్జున్ తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు.
Pushpa 2 Sets New Indian Film Records
అంతర్జాతీయ మార్కెట్లో ‘పుష్ప: ద రూల్’ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ పొందుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో, ఈ సినిమా 14.27 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. అయితే, ఈ మార్కెట్‌లో 15 మిలియన్ డాలర్ల కలెక్షన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ విశేషం. బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా 1 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది. ఇది సాధ్యం కాకపోవచ్చు అని అంచనా ఉంది.
అయినప్పటికీ, మేకర్స్ డిస్ట్రిబ్యూటర్‌కు ఏదైనా నష్టం వస్తే దాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌ను పరిశీలిస్తే, ‘పుష్ప 2’ 29.21 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నార్త్ అమెరికా తర్వాత యూఏఈ మరియు గల్ఫ్ దేశాలలో 5.4 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 2.62 మిలియన్ డాలర్లు, యూకే మరియు ఐర్లాండ్‌లో 2.22 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో, వివిధ దేశాలలో ‘పుష్ప: ద రూల్’ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి: నార్త్ అమెరికా: $14,273,728యూకే & ఐర్లాండ్: $2.22 మిలియన్ఆస్ట్రేలియా: $2.62 మిలియన్న్యూజిలాండ్: $436Kజర్మనీ: $251Kయూఏఈ & ఇతర GCC: $5.4 మిలియన్స్సింగపూర్: $486Kమలేషియా: $580Kశ్రీలంక: $146Kనేపాల్: $1.3Mఇతర యూరప్ దేశాలు & రిమైనింగ్ వరల్డ్: $1.5 మిలియన్ (అంచనా)ఆ విధంగా 18 రోజుల్లో మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 29.21 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విధంగా, ‘పుష్ప: ద రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలుస్తోంది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబో మరోసారి విజయం సాధించింది.