Pushpa-2: పుష్ప-2కి షాక్.. యూట్యూబ్లో స్ట్రీమింగ్ .. ఇక్కడ చూడండి.?
Pushpa-2: ఏంటి ఇంత తొందరగా పుష్ప-2 సినిమా యూట్యూబ్ లోకి వచ్చిందా..నిజమేనా అంటే నిజమే అంటున్నారు ఈ సినిమా చూసిన జనాలు.. మరి ఇంతకీ పుష్ప-2 సినిమా యూట్యూబ్ లో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్నో సినిమాలు పైరసీ ద్వారా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీసెంట్గా విడుదలైన పుష్ప-2 సినిమా కూడా విడుదలైన రోజే ఆన్లైన్ లో హెచ్డి క్వాలిటీతో కొన్ని ఆన్లైన్ సైట్ లలో దర్శనమిచ్చింది.
Pushpa-2 Streaming on YouTube Watch here
దీంతో చిత్ర యూనిట్ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎంతమంది నిర్మాతలు ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా కూడా ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా పుష్ప టు సినిమా మాత్రం యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవ్వడం ప్రస్తుతం అందరికీ షాకింగ్ అనిపిస్తోంది. మరి విడుదలై ఓటిటీలోకి కూడా రాకముందే ఎందుకు ఈ సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. (Pushpa-2)
Also Read: Pushpa 2 USA Collections: ఆ విషయంలో ఓడిపోయిన పుష్ప.. భారీ అవమానం!!
అయితే రూమర్ అనుకుందామంటే అది పొరపాటు పడ్డట్లే.ఎందుకంటే ఈ సినిమా నిజంగా స్ట్రీమింగ్ అవుతుంది.అయితే పుష్ప టు సినిమా లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో అవ్వడం నిజమే. కానీ అది తెలుగు వర్షన్ అయితే కాదు. హిందీ వర్షన్ పుష్ప-2 సినిమా యూట్యూబ్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవడంతో చాలామంది ఈ సినిమాని యూట్యూబ్లో వీక్షిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా పుష్ప టు నిర్మాతలు అయితే స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా యూట్యూబ్లో పుష్ప టు సినిమాని లైవ్ స్ట్రీమింగ్ చేసే వారిపై ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీస్ కేసు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.(Pushpa-2)