Pushpa The Rule: నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 స్ట్రీమింగ్.. ట్రెండింగ్ లో పుష్పరాజ్!!
Pushpa The Rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ (Pushpa: The Rule) ఇప్పుడు ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్లోనూ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా, ఓటీటీ రిలీజ్‌తో మరోసారి హైలైట్‌గా మారింది.
Pushpa The Rule Trending on Netflix
నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో పుష్ప 2 అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ దర్శకత్వం ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.
సినిమాలోని పుష్ప క్యారెక్టర్, మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్లు ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు మరోసారి పుష్పరాజ్ స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ డ్రామా థియేటర్లలో చూసినప్పుడే మంచి రెస్పాన్స్ పొందగా, ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది.
ఈ సినిమా ఓటీటీలో విడుదలై చిన్న స్క్రీన్‌పై వీక్షకులను అలరిస్తుండటంతో, కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. థియేటర్ వర్షన్‌ను మిస్ అయినవారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా పుష్ప 2 ఏ రేంజ్లో రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి!