Radish Leaves: ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు వారంలో మూడు రోజులైనా ఆకుకూరలు తప్పకుండా తినాలి. దాని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఆకుకూరలు తినడం వల్ల కళ్ల సమస్యలు సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి కావలసిన విటమిన్లు అన్ని చేకూరుతాయి. చాలామంది ముల్లంగి ఆకులు తినడానికి ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగి దుంప కన్నా ముల్లంగి ఆకులలోనే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. Radish Leaves
Radish leaves Health Benefits
ఈ ఆకులతో కర్రీ, పప్పు, పరాట, సలాడ్ ఇలా ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. ముల్లంగి ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరును సులభతరం చేస్తుంది. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. లో బీపీ సమస్యతో ఇబ్బంది పడేవారు ముల్లంగి ఆకులు తినడం వల్ల లోబీపీ సమస్య తొలిగిపోతాయి. ఈ ఆకుల్లో ఉండే సోడియం రక్తపోటును స్థిరీకరించడానికి తోడ్పడుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఏసిడిటీ వంటి సమస్యల నుంచి ముల్లంగి ఆకులతో చేసిన ఆహారం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముల్లంగి ఆకులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. Radish Leaves
Also Read: Jagan: త్వరలోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూలబోతుంది.. టిడిపికి జగన్ వార్నింగ్ ?
ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అనిమియాతో బాధపడే వారికి ముల్లంగి ఆకులు మంచి ఆహారం. ఫైల్స్ సమస్యతో బాధపడే వారికి ముల్లంగి ఆకులు ఒక వరం అని చెప్పవచ్చు. ఈ ఆకులతో చేసిన ఎలాంటి ఆహారమైన సరే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులో కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ముల్లంగి ఆకులలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ముల్లంగి ఆకులు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి. Radish Leaves