Revanth Reddy: కాంగ్రెస్ ఏడాది పాలన…కేసీఆర్ కన్నా రేవంత్‌కే ఎక్కువ వ్యతిరేకత ?
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కారుకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రజా పాలన విజయోత్సహాలు నిర్వహించడానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్ డిసెంబర్ 9వ తేదీతో విజయవంతంగా పూర్తవుతాయి అన్న మాట. Revanth Reddy
Raghunandhan rao comments on Revanth Reddy
ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై బిజెపి పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు హాట్ కామెంట్ చేశారు. టిఆర్ఎస్, బిజెపి మిత్రులు అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్తో కలిసి పని చేసింది టిఆర్ఎస్ పార్టీయేనని రఘునందన్ రావు విమర్శించారు. కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని రఘునందన్ అన్నారు. కెసిఆర్ కు అపకీర్తి రావడానికి పదేళ్ల సమయం పట్టిందని పేర్కొన్నారు. Revanth Reddy
Also Read: Telangana: కాంగ్రెస్ ఏడాది పాలనపై సంచలన సర్వే.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలనుందా ?
కానీ ఏడాదిలోనే కాంగ్రెస్ పైన అంతకుమించి వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం పై రఘునందన్ విమర్శలు చేశారు. కేసీఆర్ కు మించి రేవంత్ కు ఎక్కువ వ్యతిరేకత వచ్చిందని రఘునందన్ అన్నారు. ఫిరాయింపులపై కేసీఆర్ చేసిందే కాంగ్రెస్ చేస్తుందని రఘునందన్ మాట్లాడారు. మల్లన్న సాగర్ లో ఏం జరిగిందో లగచర్లలోను అదే జరిగిందని రఘునందన్ అన్నారు. ఆరోజు నిర్వాసితుల కన్నీరు బిఆర్ఎస్ కు కనపడలేదా అని బిఆర్ఎస్ ను ప్రశ్నించారు రఘునందన్. అయితే రఘునందన్ రావు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. Revanth Reddy