Rahul Gandhi: బీజేపీతో మా కాంగ్రెస్ పని చేస్తున్నారు ?
Rahul Gandhi: బీజేపీతో మా కాంగ్రెస్ పని చేస్తున్నారు ? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాజగా గుజరాత్ వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

Rahul Gandhi Comments on congress leaders
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీ టీమ్‌గా పనిచేస్తున్న వారిని బయటకు నెట్టేస్తామని హెచ్చరించారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో నిప్పులు చెరిగిన రాహుల్.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న నేతలను ఉద్దేశించి.. కూడా వ్యాఖ్యానించారు.
Congress: గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు?
అయితే… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ లను ఉద్దేశించి…కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఇద్దరూ బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.