Raja Saab teaser: రెబల్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వబోతున్న మారుతీ.. టీజర్ రెడీ!!
Raja Saab teaser: ప్రభాస్ తన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాక, అతని తదుపరి ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్‌లోని కొత్త కోణాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ప్రభాస్ స్టైలిష్ లుక్, మారుతి అందించిన కొత్త తరహా కథ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి.
Raja Saab teaser expected this December
‘రాజా సాబ్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. మారుతి సాధారణంగా తన సినిమాల్లో కామెడీకి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఈసారి ఆయన థ్రిల్లర్ జోనర్‌ను హ్యాండిల్ చేస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్, మారుతి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Dhanush takes legal action: నయన్ కు పదికోట్ల జరిమానా.. చిన్న తప్పవుకు కోర్టుకు ధనుష్!!
ప్రభాస్ అభిమానులు ‘రాజా సాబ్’ టీజర్ కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్‌ను డిసెంబర్ 25 లేదా జనవరి 1న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రభాస్ ఇంతవరకు చేసిన పాత్రల కంటే భిన్నంగా ఉండబోతున్న ఈ పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను టీజర్‌లో చూపించనున్నారు. టీజర్ విడుదల తరువాత సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరుగుతాయనే నమ్మకం యూనిట్‌కు ఉంది.
2025 ఏప్రిల్ 10న ‘రాజా సాబ్’ గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రభాస్ తన కెరీర్‌లో మరొక సెన్సేషనల్ హిట్‌ను అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమ మొత్తం కూడా ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం ప్రభాస్ విజయావకాశాలను మరింతగా పెంచుతుందా లేదా అన్నది చూడాలి.