Rajamouli: రాజమౌళి ఫస్ట్ లవ్ బ్రేకప్.. అందుకే సమంతతో ఆ పని..?
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి రమా రాజమౌళి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే సంగతే చాలామందికి తెలుసు. కానీ రమా రాజమౌళి కంటే ముందే ఆయన మరో అమ్మాయిని ప్రేమించారట. ఆమె పేరే భారతి.. మరి ఎంతకీ ఎవరా ఆ భారతి.. రాజమౌళి ఫస్ట్ లవ్ బ్రేకప్ కి సమంతకి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి దర్శక ధీరుడుగా పేరు తెచ్చుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో సాహసాలు ఉన్నాయి.
Rajamouli first love broke up
ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రాజమౌళి తాజాగా రానా టాక్ షో కి వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అయితే ఇదే షోలో తన ఫస్ట్ లవ్ గురించి రాజమౌళి మాట్లాడుతూ..నేను ఇంటర్లో ఉన్న సమయంలో ఓ అమ్మాయిని తెగ ఇష్టపడ్డాను. ఇక ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆమెతో మాట్లాడడానికి సంవత్సరం పట్టింది.(Rajamouli)
Also Read: Allu Arjun: పుష్ప 2 రన్ టైం 3 గంట.. పుష్ప బెయిల్ టెన్షన్ డ్రామా 6 గంటలు!!
అది కూడా ఒకే ఒక్క మాట. అయితే నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్న విషయం మా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.దాంతో మా ఫ్రెండ్స్ అందరూ అరేయ్ ఆమెతో మాట్లాడరా అని నన్ను ఆమె దగ్గరికి తోసేసేవారు. కానీ నేను చాలా భయపడిపోయే వాడిని. కానీ ధైర్యం చేసి నేను మాట్లాడిన ఒకే ఒక్క మాట భారతి ట్యూషన్ ఫీజ్ కట్టావా.. ఈ ఒక్క మాట తప్ప నేను ఇంకో మాట మాట్లాడలేదు. అంటూ తన ఫస్ట్ లవ్ గురించి రాజమౌళి చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె చూసిన చూపులు ఎన్నో రోజుల నుండి రాజమౌళి పిలిస్తే పలుకుదాం అన్నట్లుగా అనిపించాయట.
అయితే ఆమె చూపులు రాజమౌళి మైండ్ లో అలాగే ఫిక్స్ అయ్యి ఈగ సినిమా సమయంలో సమంతతో అలాగే చేయించారట. ఎందుకంటే నాని పిలిచిన సమయంలో సమంత చాలా రోజుల నుండి నాని పిలిస్తే బాగుండు అని చూస్తూ కనిపిస్తుంది. అలా నాని పిలవగానే ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గతంలో భారతి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఒక్కటేనని భారతి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని మైండ్ లో పెట్టుకొనే సమంతతో అది రీ క్రియేట్ చేయించాను అంటూ రాజమౌళి ఆ షోలో చెప్పుకొచ్చారు.(Rajamouli)