Rajamouli: జక్కన్నకి ఆ హీరోయిన్ పై చచ్చేంత లవ్..పెళ్లికి కూడా రెడీ అయ్యారా.?
Rajamouli: ఛీ..ఛీ.. తెలుగు సినిమా ఇండస్ట్రీయా.. అక్కడ దర్శకనిర్మాతలకు సినిమాలు తీయడం వచ్చా..అసలు వాళ్ల హీరోలకు నటించడం కూడా రాదు..ఆ ఇండస్ట్రీ చాలా ఓల్డ్ అంటూ ఇతర ఇండస్ట్రీల వారు నిందించేవారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఇతర ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఆఫర్లు ఇచ్చేవారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీపై చాలా చులకన భావం ఒకప్పుడు ఉండేది.. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను ప్రపంచ దేశాల్లో తెలిసేలా చేసిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి..

Rajamouli loves that heroine very much
బాహుబలి సినిమాకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఒక విధంగా ఉండేది. బాహుబలి తర్వాత మరోరకంగా తయారయింది.. ప్రస్తుతం తెలుగు హీరోలకు కానీ, డైరెక్టర్లకు గాని దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.. దీనికంతటికి కారణం జక్కన్న చేసిన మాయాజాలమే అని చెప్పవచ్చు.. ఆయన బాహుబలి ద్వారా ఏ ఇండస్ట్రీలో లేనటువంటి రికార్డులను తెలుగు ఇండస్ట్రీకి సొంతం చేశారు.. దీంతో ప్రభాస్ ను స్టార్ ను చేయడమే కాకుండా తాను కూడా దేశంలోని టాప్ 3 డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు..(Rajamouli)
Also Read: Chiranjeevi: లైవ్ లోనే కొట్టుకున్న చిరు రాజశేఖర్.. భయపడేది లేదన్న చిరు.!
అలాంటి రాజమౌళి కేవలం సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో విషయంపై నోరు మెదపరు.. కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ గురించి విపులంగా బయటపెట్టారు.. తాను ఒక హీరోయిన్ ను పీకల్లోతు లవ్ చేశారట ఛాన్స్ ఉంటే ఆ హీరోయిన్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.. ఇప్పటి కాలంలో ఆ హీరోయిన్ తన ముందుకు వస్తే మాత్రం తన భార్య రమా రాజమౌళిని విడిచిపెట్టి మరి పెళ్లి చేసుకుంటానని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే.. మహానటి సావిత్రి..

రాజమౌళి సావిత్రిని ఎంతగానో లవ్ చేశారట.. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట.. కానీ ఆమె వయసులో చాలా పెద్దదైపోవడం వల్ల ఆయనకు సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.. రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ను స్టార్ ను చేసి ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పాన్ ఇండియా స్టార్లను చేశారు. ప్రస్తుతం మహేష్ బాబును పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.(Rajamouli)