Rajamouli-Mahesh Babu: కళ్ళు చెదిరే బడ్జెట్ తో రాబోతున్న రాజమౌళి మహేష్ బాబు మూవీ..?
Rajamouli-Mahesh Babu: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చులకన భావంతో చూసేవారు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమాకి కూడా అవార్డు వచ్చిన దాఖలాలు కనిపించేవి కావు. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ క్యాతిని దేశాలు దాటించి ప్రపంచ దేశాల్లో పరిచయం చేసిన ఏకైక దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు.. ఈయన డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమా తెలుగు వారి సత్తా ఏంటో చూపించింది.
Rajamouli-Mahesh Babu movie Budget
ఇక బాహుబలి తర్వాత బాహుబలి 2 కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధించి అదరహో అనిపించింది.. అలాంటి రాజమౌళితో సినిమా అంటే బడ్జెట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయనతో సినిమా చేస్తే హిట్టే అవుతుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఎంత బడ్జెట్ పెట్టడానికైనా ముందుకు వస్తారు. అలాంటి రాజమౌళి తాజాగా మహేష్ బాబును పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం చేయడానికి ముందుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు అన్ని కసరత్తులు పూర్తి చేసుకున్నారట.(Rajamouli-Mahesh Babu)
Also Read: Mahesh Babu: ఆ హీరోయిన్ అంటే మహేష్ బాబుకి ఎందుకంత పగ.. ఓవర్ బిల్డప్ అంటూ.?
ఇదే తరుణంలో వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా బడ్జెట్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. జక్కన్న సినిమా అంటే హీరోల పారితోషికంతో పాటు టెక్నీషియన్స్, ఇతర ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి.. ఇదే తరుణంలో మహేష్ బాబుతో కూడా ఒక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఏ విధంగా ప్రజల ఆదరణ పొందాయో అదే రీతిలో తీసుకురావాలని అనుకుంటున్నారట.
దీనికోసం నిర్మాతగా కేఎల్ నారాయణ ఉండబోతున్నారట. అయితే ఈ చిత్రం కోసం ఇప్పటికే 1000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టడానికి ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.. తెలుగు ఇండస్ట్రీలో 1000కోట్లు అంటే మామూలు బడ్జెట్ కాదు. ఒకవేళ సినిమా అటూ ఇటూ అయితే మాత్రం నిర్మాతకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి.. కానీ రాజమౌళి సినిమా కాబట్టి అలాంటి భయం ఏమీ లేకుండా ఆయన అంత బడ్జెట్ కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.(Rajamouli-Mahesh Babu)