RCB: బెంగళూరు కొత్త కెప్టెన్ గా పాటిదార్..ఎందుకు ఇతనే ?
RCB: IPL 2025కి ముందు కీలక ప్రకటన చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మార్చి 21న ప్రారంభం కానున్న IPL 2025 కు ముందు తమ కెప్టెన్ పేరు అనౌన్స్ చేసింది. భారత బ్యాటర్ రజత్ పాటిదార్ పేరు కెప్టెన్‌గా నియామకం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాటిదార్, క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మరియు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ హాజరవడంతో RCB ఈ ప్రకటన చేసింది.

Rajat Patidar is The New RCB Captain For IPL 2025
2022 నుంచి 2024 వరకు కెప్టెన్‌గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ స్థానంలో పాటిదార్ ఎంపికయ్యాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ యశ్ దయాల్‌తో పాటు RCB ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో భారత బ్యాటర్ రజత్ పాటిదార్ ఒకరు. 20 ఓవర్ల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు 50-ఓవర్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లలో తన రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు భారత బ్యాటర్ రజత్ పాటిదార్.
Kohli: కోహ్లీకి దెబ్బేసిన కేన్ మామ..!
31 ఏళ్ల భారత బ్యాటర్ రజత్ పాటిదార్… 2021లో RCBలో చేరాడు. ఈ తరుణంలోనే… జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. 28 మ్యాచ్‌లలో 158.85 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు భారత బ్యాటర్ రజత్ పాటిదార్. అయితే.. కెప్టెన్ గా ఉండేందుకు నిరాకరించడంతో… భారత బ్యాటర్ రజత్ పాటిదార్ ను ఫైనల్ చేశారు.