Rajendra Prasad: ఆ సీనియర్ నటి ఇంట్లో రాజేంద్ర ప్రసాద్.. ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే.?


Rajendra Prasad is in the house of that senior actress

Rajendra Prasad: నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పుష్ప టు విడుదల హిట్ అయిన సమయంలో వాడు ఎర్ర చందనం దొంగతనం చేసే దొంగ వాడు హీరో ఏంటి.. వాడు విలన్ అంటూ పుష్ప-2 లో నటించిన హీరో అల్లు అర్జున్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అలాగే రీసెంట్గా రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్లో క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Rajendra Prasad is in the house of that senior actress

అవి వార్నర్ అభిమానులను హార్ట్ చేశాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ వెనక్కి తగ్గి సారీ కూడా చెప్పారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా రాజేంద్రప్రసాద్ గురించి ఒక మ్యాటర్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే రాజేంద్రప్రసాద్ తరచుగా ఓ సీనియర్ నటి ఇంటికి ఎందుకు వెళ్తారు.వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని చాలామందిలో ఒక ఆసక్తి అయితే ఉంది. (Rajendra Prasad)

Also Read: Court Movie: ప్రేమలో పడ్డ కోర్టు మూవీ జోడి.. తెరవెనుక రొమాన్స్.?

మరి ఇంతకీ రాజేంద్రప్రసాద్ తరచుగా వెళ్లే ఈ ఇల్లు ఎవరిదో కాదు నటి రమాప్రభ. సీనియర్ నటి అయినటువంటి రమాప్రభ ఎన్నో సినిమాల్లో తల్లి,అత్త,బామ్మ పాత్రలు పోషించింది. అయితే ఈమె సీనియర్ నటి శరత్ బాబుతో కొద్దిరోజులు సహజీవనం చేసిన సంగతి మనకు తెలిసిందే.కానీ ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్ కి రమాప్రభ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మీ అందరిలో ఒక అనుమానం ఉండొచ్చు.

Rajendra Prasad is in the house of that senior actress

ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే అత్త అల్లుడు. అయితే రమాప్రభ కి పిల్లలే లేరు. అలాంటప్పుడు అల్లుడు ఎలా అవుతారని అనుకోవచ్చు.అయితే రమాప్రభ తన చెల్లెలు కూతుర్ని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. అలా పెద్దయ్యాక ప్రయోజకురాలిని చేశాక నటుడు రాజేంద్రప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేసింది. అలా వీరిద్దరి మధ్య అత్త అల్లుళ్ళ బంధం ఏర్పడింది.అందుకే రాజేంద్రప్రసాద్ తరచూ రమాప్రభ ఇంట్లో కనిపిస్తూ ఉంటాడు.(Rajendra Prasad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *