Rajendra Prasad: ఒరేయ్ దొంగా అంటూ స్టార్ క్రికెటర్ ని స్టేజ్ మీదే తిట్టిన రాజేంద్రప్రసాద్.?

Rajendra Prasad: ఈ మధ్య కాలంలో రాజేంద్రప్రసాద్ పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.ఆ మధ్యకాలంలో పుష్ప టు విడుదలైన సమయంలో ఓ సినిమా ఈవెంట్లో ఎర్ర దుంగలు కొట్టేసేవాడు స్మగ్లింగ్ చేసేవాడు ఒక హీరోనా.. వాడు దొంగ అంటూ ఇష్టం వచ్చినట్లు పుష్పటు సినిమా గురించి మాట్లాడారు. ఆ తర్వాత నేను అల్లు అర్జున్ ని అనలేదు అన్నట్టుగా మాట్లాడారు. అయితే తాజాగా ఓ క్రికెటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rajendra Prasad scolded the star cricketer on stage
వాడు ఓ పెద్ద దొంగ అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఎవరిని తిట్టారయ్యా అంటే.. స్టార్ క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ ని.. నితిన్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ రాబిన్ హుడ్.ఈ సినిమా మార్చి 27న విడుదలకు సిద్ధంగా ఉంది. (Rajendra Prasad)
Also Read: Heroine: తమిళ హీరోతో బ్రేకప్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. ఫొటోస్ వైరల్.?
ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ రాబిన్ హుడ్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వస్తారు. అలా క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ కూడా హైదరాబాద్ కి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే రాబిన్ హుడ్ మూవీలో కీలక పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ..

వీడు ఓ పెద్ద దొంగ..ఒరేయ్ నువ్వు క్రికెట్ ఆడమంటే యాక్టింగ్ చేస్తున్నావా..వీడు మామూలోడు కాదు అంటూ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒరేయ్ వాడు వీడు అంటూ మాట్లాడారు. అయితే రాజేంద్రప్రసాద్ మాటలు డేవిడ్ అభిమానులకి కోపం తెప్పించినప్పటికి ఆయన అలా సరదాగా మాట్లాడిన మాటలు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ ని ఉద్దేశించి మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(Rajendra Prasad)