Rajinikanth: ఆ హీరోయిన్ తో ధనుష్ సహజీవనం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్.?

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ లైఫ్ లో పెద్ద స్టార్ అయ్యారు.కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేంటంటే ఇద్దరు కూతుర్లలో రెండో కూతురు పెళ్లి విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం ఆమె లైఫ్ బాగానే ఉన్నప్పటికీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ జీవితం మాత్రం అంత బాగోలేదని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఆమె తన 18 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి భర్తతో విడాకులు తీసుకొని విడిగా బతుకుతుంది.
Rajinikanth gave a serious warning
ఈ మధ్యనే మళ్ళి సినీ ఇండస్ట్రీలోకి రాణిస్తోంది.అయితే ధనుష్ ఐశ్వర్యలు కోలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈ జంట విడాకులు తీసుకోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఐశ్వర్య ధనుష్ తనకంటే వయసులో చిన్నవాడైనా సరే ఎంతో ప్రేమించి అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత ధనుష్ చేసే అరాచకాలు చూసి తట్టుకోలేక చివరికి విడాకులు ఇచ్చేసింది. ముఖ్యంగా ధనుష్ ని అందరూ ప్లే బాయ్ అని అంటూ ఉంటారు.(Rajinikanth)
Also Read: Nidhi Agarwal: హీరోతో ఎఫైర్.. పెళ్లికి రెడీ అయిన నిధి అగర్వాల్..?
ఎందుకంటే ధనుష్ ఎవరితో సినిమాలు చేసిన కూడా వారితో ఎఫైర్ పెట్టుకుంటారు అనే టాక్ కోలీవుడ్లో ఉంది. అలా వీరిద్దరు విడాకులకు అమ్మాయిలతో ధనుష్ తిరగడం కూడా ఒక కారణమైంది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్ జర్నలిస్టు చేయార్ బాలు మాట్లాడుతూ.. ధనుష్ ఐశ్వర్యలకు అమలాపాల్ వల్లే విడాకులు అయ్యాయి. ధనుష్ విఐపి2 సినిమా చేస్తున్న టైంలో అమలాపాల్ ఇంట్లోనే ఉండడంతో అది గమనించి ఇంటికి ఎందుకు రావడం లేదు అని ఓ రోజు ఐశ్వర్య తన కళ్ళారా చూసింది.

దాంతో బాధపడుతూ ఐశ్వర్య తండ్రి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పగా రజినీకాంత్ అమలాపాల్ ఇంటికి వెళ్లి మరీ కూతుర్ని అల్లుడ్ని ఎందుకు విడదీస్తున్నావ్ వారి కాపురంలో ఎందుకు నిప్పులు పోస్తున్నావు ఇంకోసారి వారి లైఫ్ లోకి తొంగి చూస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చారు. కానీ అమలాపాల్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు.ఈ కారణంగానే ఐశ్వర్య ధనుష్ లు విడాకులు తీసుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ జర్నలిస్టు చేయార్ బాలు మాట్లాడిన వీడియో మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు అమలాపాల్ వల్లే వీళ్ల పచ్చని కాపురం కూలిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Rajinikanth)