Rakul Preet Singh: నమ్మిన వాడే మోసం చేశాడు.. బ్రేకప్ పై రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్.?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ బ్రేకప్ పై తాజాగా మాట్లాడడంతో చాలామందికి రకుల్ ప్రీత్ సింగ్ పర్సనల్ లైఫ్ పై అనుమానాలు వస్తున్నాయి.మరి ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి ముందు జరిగిన బ్రేకప్ గురించి మాట్లాడిందా.. లేదా పెళ్లయ్యాక ఏమైనా గొడవలు వచ్చాయా.. పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ కంటే ఎక్కువగా సౌత్ లోనే స్టార్ హీరోయిన్ అయింది.ఈ ముద్దుగుమ్మ పొడుపు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకుంది.
Rakul Preet Singh shocking comments on the breakup
అయితే అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ నార్త్ లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ హీరోయిన్ సినీ కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు-2, అయిలాన్ వంటి సినిమాలతో వచ్చినప్పటికీ ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ బ్రేకప్ గురించి మాట్లాడంతో అందరూ షాక్ అయిపోయారు.మరి ఇంతకీ ఆ బ్రేకప్ ముచ్చట్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. (Rakul Preet Singh)
Also Read: Samantha: అప్పుడు బావమరిది ఇప్పుడు బావ.. మళ్ళీ అదే తప్పు చేస్తున్న సమంత.?
చాలా మంది నటినటులు బ్రేకప్ అయ్యాక ఎన్నో హార్ట్ బ్రేకింగ్ ముచ్చట్లు మాటలు చెబుతూ ఉంటారు. అలా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాజాగా బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోతే దానికంటే భయంకరమైన ఘోరం ఇంకోటి ఉండదు. అది చాలా భయంకరం.. ఎవరిని ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే మోసపోతే ఎంతో బాధ ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి నాకు కూడా ఎదురయింది. ఆ టైంలో నా బాధ వర్ణాతాతీతం.

అలాగే మనం మన లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని మనం మాత్రమే చేయగలగాలి. ఆ లోటుని వేరే వాళ్ళు తీరుస్తారు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మనమే దాన్ని భర్తీ చేయాలి. అయితే నా ఆలోచన విధానం నా అభిప్రాయాలు ఎలా ఉంటాయో ముందు నుండి చూసుకుంటూ వచ్చిన జాకీ భగ్నాని నన్ను అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మేం చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. ఇక రకుల్ మాటలతో పెళ్లికి ముందు ఆమె బ్రేకప్ గురించి చెప్పిందని అందరికీ అర్థమైంది.(Rakul Preet Singh)