Ram Charan: ఆ సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్నా.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.?
Ram Charan: చాలామంది హీరోలు తాము చేసిన ఒకటి రెండు సినిమాలు ప్లాపులు అయితే తమ చేతులారా తామే తప్పు చేశామని కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకొని బాధపడుతూ ఉంటారు.అంతేకాదు ఈ విషయాలను కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో బయటపెట్టి బాధపడతారు. అలా రామ్ చరణ్ కూడా తాను ఓ సినిమాలో నటించి అతిపెద్ద తప్పు చేశాను అంటూ రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో ఈ విషయాన్ని బయట పెట్టారు.
Ram Charan: Are you still suffering after doing that movie
అంతేకాదు నా కెరీర్ లోనే అది పెద్ద డిజాస్టర్ అని,అసలు ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అంటూ రాంచరణ్ చెప్పుకోచ్చారు. మరి ఇంతకీఅన్ స్టాపబుల్ షోలో రాంచరణ్ ఏం చెప్పారయ్యా అంటే.. బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాను నేను తెలుగులో తుఫాన్ పేరుతో రీమేక్ చేశాను.. కానీ నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు ఇదే. (Ram Charan)
Also Read: Goodachari 2: గూఢచారి 2 కోసం నానాతంటాలు పడుతున్న అడివి శేష్!!
ఆ సినిమా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది. ఆ సినిమా డిజాస్టర్ ఫలితం నా కెరీర్ పై కొంత చూపెట్టింది. ఇప్పటికి కూడా ఆ సినిమాలో ఎందుకు నటించానా అని బాధ పడుతుంటాను అంటూ రాంచరణ్ చెప్పుకోచ్చారు.ఇక హిందీ జంజీర్ మూవీ ని తెలుగులో తుఫాన్ పేరుతో అపూర్వ లకియా దర్శకత్వం వహించగా రాంచరణ్ సరసన గ్లోబల్ బ్యూటీ అయినటువంటి ప్రియాంక చోప్రా నటించింది.
అయితే ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి అట్టర్ ప్లాఫ్ అయింది. అంతేకాదు ఇది రామ్ చరణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా సమయంలో ప్రియాంక చోప్రా కూడా రామ్ చరణ్ పై అసహనం వ్యక్తం చేసింది. రామ్ చరణ్ షూటింగ్ కి ఆలస్యంగా రావడంతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ కి కూడా ఆలస్యంగా వచ్చారు. ఆయన ఆలస్యం చేయడం వల్ల నా మిగతా షూటింగ్స్ పై ఆ ప్రభావం పడింది అంటూ చెప్పుకొచ్చింది.(Ram Charan)