Ram Charan: రామ్ చరణ్ కి వింత వ్యాధి.. గేమ్ ఛేంజర్ రిలీజ్ వేళ బయటపడ్డ షాకింగ్ నిజం..?
Ram Charan: మెగా ఫ్యామిలీలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వీరందరిలోకెల్లా అద్భుతంగా దూసుకుపోతున్న హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల విపరీతమైనటువంటి ఆసక్తి నెలకొని ఉంది. అంతేకాదు ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భయం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళితో సినిమా తర్వాత ఏ హీరో సినిమా అయినా సరే ఫ్లాప్ అవుతుంది.
Ram Charan has a strange disease
కానీ దాన్ని బ్రేక్ చేసి జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ విధంగానే రామ్ చరణ్ హిట్ అందుకుంటారా లేదంటే ఫ్లాప్ సెంటిమెంట్ మూటగట్టుకుంటారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ అవ్వనుండడంతో దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఏపీలో బృందావన్ గార్డెన్ లోని వజ్రా గ్రౌండ్స్ లో రామ్ చరణ్ సంబంధించినటువంటి ₹256 అడుగుల కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు అభిమానులు.(Ram Charan)
Also Read: Nagarjuna: ఆ హీరో మొహం చూసి మోసపోయా.. నరకం అనుభవించా..నాగార్జున షాకింగ్ కామెంట్స్.?
అంతేకాదు త్వరలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారని దీనికి అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే స్టేజిపై కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో రామ్ చరణ్ కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.. రామ్ చరణ్ కు ఒక వీక్నెస్ ఉంటుందని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆయన సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి ఆ విషయాన్ని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో రాంచరణ్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్..
వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంలో రామ్ చరణ్ సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని ఎన్టీఆర్ బయట పెట్టారు.. రామ్ చరణ్ లో అతిపెద్ద మతిమరుపు లక్షణం ఉన్నది. వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ పేరు తెలుసుకొని కొద్దిసేపు తర్వాత వాళ్ళు మన ముందుకు వస్తే పేరు మర్చిపోతారు. అతని మరో పేరు పెట్టి పిలుస్తాడు. అలా చిత్ర యూనిట్ లో చాలామందిని పేర్లు మరిచిపోయి ఒకరి పేరు మరొకరికి పెట్టి పిలుస్తూ ఉంటారు. పాపం వారే ఏ పేరు పెట్టి పిలిచిన, అర్థం చేసుకొని రామ్ చరణ్ తో వెళ్లి మాట్లాడతారు.. ఈ విధంగా రామ్ చరణ్ బలహీనతను ఎన్టీఆర్ అప్పట్లో బయట పెట్టడంతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Ram Charan)