Ram Charan: దిల్ రాజు నష్టాన్ని ఎవరు పూడుస్తారు.. మొహం చాటేస్తున్న గ్లోబల్ స్టార్?
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటించిన “గేమ్ చేంజర్” సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమా ఒక ఎమోషనల్, మెసేజింగ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించారు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చేస్తున్న ప్రస్తుత సినిమాలు మాత్రం మెగా అభిమానుల్లో ఆశల్ని మరింత పెంచుతున్నాయి.
Ram Charan next big projects 2025
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా, సుకుమార్ తో కలిసి భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు, “గేమ్ చేంజర్” సినిమా నిర్మాత దిల్ రాజు తో సినిమా చేయబోతున్నాడట. అది కూడా రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా ఉంటుందని తెలుస్తుంది..
అయితే ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ రెండు సినిమాలను తప్ప మరే ఇతర ప్రాజెక్టు లకు ఒకే చెప్పలేదు. పెద్ద పెద్ద కాంబో లు సెట్ చేసే దిల్ రాజు ఇది సెట్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు రామ్ చరణ్ దిల్ రాజు తో మరో సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చారట. ఏదేమైనా గేమ్ చేంజర్ ఫ్లాప్ భారం ఒక్క దిల్ రాజు మీదే వేయకుండా రామ్ చరణ్ ఆయనకు మరో సినిమా చేస్తానని మాటివ్వడం నిజంగా మంచి విషయం. మరి ఈ సినిమా ఎప్పుడు ఎవరితో ఉంటుందో వేచి చూడాలి.