Ram Charan: మహేష్ తో రామ్ చరణ్ మల్టీ స్టారర్.. ఎప్పుడంటే?
Ram Charan: తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల మధ్య ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. “RRR” సినిమా ఈ ట్రెండ్‌ను తిరిగి అలాంటి సినిమాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేష్ బాబు కలిసి ఒక సినిమా చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
Ram Charan ready for Mahesh movie
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న “అన్‌స్టాపబుల్” టాక్‌షోలో రామ్ చరణ్ పాల్గొనగా, ఆ షోలో బాలకృష్ణ, రామ్ చరణ్‌ను మహేష్ బాబు లేదా ప్రభాస్‌తో కలిసి సినిమా చేయాలని సూచించారు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ, మహేష్ బాబుతో కలిసి సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సమాధానం తెలుగు సినిమా ప్రేమికులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
తెలుగులో సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అయిన మహేష్ బాబు, రామ్ చరణ్ కలసి ఒకే తెరపై కనిపించడం ప్రేక్షకుల పెద్ద కల. ఈ కల త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఇంకా జరగలేదు, కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ కలయిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి సినెమాలపనుల్లో వారున్నారు. బుచ్చిబాబు తో రామ్ చరణ్ సినిమా చేస్తుంటే మహేష్ రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత వారికి నచ్చే కథ వస్తే అప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.