Ram Charan: ఆ హీరోయిన్ తో రహస్య పెళ్లి.. చిరంజీవి పరువు గంగలో కలిపిన రామ్ చరణ్.?

Ram Charan: రామ్ చరణ్ ఇప్పటివరకు తండ్రి పేరు చెడిపోయేలా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. కానీ ఓ సమయంలో మాత్రం రామ్ చరణ్ చేసిన పనికి చిరంజీవి తల తీసేసినట్టు అయిందట. రామ్ చరణ్ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోకుండా ఉన్నారట. మరి ఇంతకీ రాంచరణ్ చిరంజీవి పరువు పోయేలా చేసిన ఆ పని ఏంటంటే ఓ హీరోయిన్ తో రహస్య పెళ్లి.. మరి రామ్ చరణ్ ఎవరిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
Ram Charan Secret marriage with that heroine
రామ్ చరణ్ తన మొదటి మూవీ చిరుత హీరోయిన్ నేహా శర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఆ మధ్యకాలంలో కొన్ని రూమర్లు వినిపించాయి. అంతేకాదు ఉపాసనని లైన్లో పెట్టి మరోపక్క నేహా శర్మని రహస్యంగా రామ్ చరణ్ పెళ్లాడారంటూ కొన్ని నేషనల్ వెబ్సైట్లలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అయిపోయారు. (Ram Charan)
Also Read: Court Movie: ప్రేమలో పడ్డ కోర్టు మూవీ జోడి.. తెరవెనుక రొమాన్స్.?
అయితే ఈ వార్తలపై చిరంజీవిగానీ,రామ్ చరణ్ గానీ స్పందించకపోవడంతో అవి నిజమే అని చాలామంది భావించారు.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు రాంచరణ్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నేను నేహా శర్మని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు చాలామంది రూమర్లు క్రియేట్ చేశారు.కానీ ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదు.అలాగే మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా రూమర్లు క్రియేట్ చేశారు.

ఈ రూమర్ల వల్ల నేను ఉపాసనకి సమాధానం చెప్పుకోవాల్సిన పని వచ్చింది. అలాగే ఇంట్లో వాళ్ళను కూడా మీరు భయపడకండి నేను ఎలాంటి తప్పు చేయడం లేదు.అవన్నీ రూమర్లు మాత్రమే అని సర్ది చెప్పాను. ఉపాసన దగ్గర ఈ విషయం ప్రస్తావించగా ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్లు వస్తాయో నాకు తెలుసు నేనేమీ తప్పుగా అర్థం చేసుకోనులే అంటూ నాకు సపోర్ట్ ఇచ్చింది అంటూ రాంచరణ్ చెప్పుకోచ్చారు.(Ram Charan)