Ram Charan: పుష్ప-2 పై మాట్లాడిన రామ్ చరణ్..బన్నీని అవమానించి..?
Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి వ్యాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్. ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించారు. కానీ ఈ ఫ్యామిలీలు ఎంత దగ్గరైనా కానీ వీరి కుటుంబాల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది.. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అంత టచ్ లో ఉండరు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తీసిన పుష్పా 2 సినిమా వల్ల జరిగినటువంటి ఒక సంఘటన సంచలనం రేపింది.
Ram Charan who spoke on Pushpa-2
దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దీంతో సినీ ఇండస్ట్రీలోని వారంతా అల్లు అర్జున్ ను పరామర్శించారు కానీ రామ్ చరణ్ మాత్రం కనీసం ఆయనను పలకరించలేదట. ఇదంతా పక్కనబెడితే తాజాగా రామ్ చరణ్ గేమ్ చేజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వేడుకలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అమెరికాలోని డల్లాస్ లో జరిగినటువంటి ఈవెంట్ లో బుచ్చిబాబుతో పాటు సుకుమార్ వెళ్లారు. (Ram Charan)
Also Read: Allu Arjun Case: తాట తీసిన అల్లు అర్జున్..ఫైనల్ గా క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్!!
ఈ తరుణంలోనే సుకుమార్ వేదికపై మాట్లాడుతూ మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను కానీ రాలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ మాట్లాడుతూ ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు అద్భుతమైన హిట్లు సాధించాయి. రంగస్థలం పుష్ప2 సినిమాలు ఏ విధమైన విజయం సాధించాయో అందరికీ తెలుసు.
ఈ విధంగా డైరెక్టర్ సుకుమార్ ను పొగిడాడే తప్ప పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ నటనను ఏమాత్రం పొగడలేదు. దీన్నిబట్టి చూస్తే రామ్ చరణ్ కు అల్లు అర్జున్ పై ఎంతో కొంత ఈర్ష ఉన్నట్టు అర్థమవుతోంది. అంతేకాకుండా ఈ సినిమా అద్భుతమైన హిట్ సాధించడంతో ఆయన కాస్త ఈగోకు ఫీలయ్యాడా అంటూ కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Ram Charan)