Shami: రంజాన్ వివాదంలో చిక్కుకున్న మహ్మద్ షమీ.. ముస్లిం మత పెద్దల ఆగ్రహం!!

Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రంజాన్ ఉపవాసం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా షమీ మైదానంలో జ్యూస్ తాగడం ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి కారణమైంది.
Ramadan Fasting Debate Over Shami
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం పాటించాలి. ఆరోగ్య సమస్యలు లేని వారు దీనికి అనుగుణంగా ఉండాలని మతపెద్దలు చెబుతారు. అయితే, షమీ మ్యాచ్ సమయంలో జ్యూస్ తాగిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాహాబుద్దీన్ రజ్వి, “ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఉపవాసం పాటించకపోవడం పాపం” అని వ్యాఖ్యానించారు.
మ్యాచ్ సందర్భంగా షమీ నీరు లేదా ఇంకా ఏదో డ్రింక్ తాగాడు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. షమీ ఆడుతున్నాడంటే, ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. మరి ఆరోగ్యంగా ఉన్న అతడు ఉపవాసం ఎందుకు చేయలేదు. నీళ్లు ఎందుకు తాగాడు. షమీ చర్య ఎంతో మంది ప్రజలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. అతడు కచ్చితంగా దేవుడికి అతడు సమాధానం చెప్పాలి” అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాహాబుద్దీన్ రజ్వి వీడియోలో చెప్పారు.
అయితే, క్రికెట్ అభిమానులు షమీని సమర్థిస్తున్నారు. దేశ సేవ మత కట్టుబాట్ల కంటే ముఖ్యమని, అథ్లెటిక్స్‌లో హైడ్రేషన్ తప్పనిసరి అని వాదిస్తున్నారు. 50 ఓవర్ల ఫీల్డింగ్, 10 ఓవర్ల బౌలింగ్ చేసే క్రికెటర్ నీరు తాగకపోతే శారీరకంగా ఇబ్బంది పడతాడని అంటున్నారు. ఈ వివాదం మత విశ్వాసాలు మరియు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మధ్య సరిహద్దులను తిరిగి చర్చకు తెచ్చింది.