Rambha: సీనియర్ నటి రంభ..ఒకప్పుడు చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్,బాలకృష్ణ,వెంకటేష్ వంటి హీరోలతో నటించి స్టార్ స్టేటస్ సంపాదించింది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్,కోలీవుడ్,భోజ్పురి ఇలా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణించింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా రంభ ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.
Rambha character is like that
ఈ నేపథ్యంలోనే రంభ గురించి ఒక న్యూస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..రంభ క్యారెక్టర్ అలాంటిదని, తండ్రికి ఆరు నెలలు చుక్కలు చూపెట్టిందని చిత్రహింసలు పెట్టి అలాంటి పని చేసింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం రంభ చేసిన కామెంట్లే. రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా తప్పు లేకపోతే నేను అస్సలు ఊరుకోను. (Rambha )
Also Read: Aman Preet Singh: డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్.. టెన్షన్ లో ఆ హీరోయిన్..?
ఒకవేళ నా తప్పు ఉంటే ఎంత చిన్నవారైనా సరే క్షమించమని అడుగుతాను. అయితే నేను నా కన్న తండ్రి విషయంలోనే చిన్నతనంలో చాలా కఠినంగా ప్రవర్తించే దానిని. మా నాన్న నన్ను ఏమైనా అంటే దాదాపు ఆరు నెలల వరకు మాట్లాడకుండాఆయనకు పట్టపగలే చుక్కలు చూపించేదాన్ని.మాట్లాడకపోయినా కూడా నాకు కావలసినవి అన్నీ షాప్ కు వెళ్లి తీసుకువచ్చేవారు.
ఇక మా నాన్న నేను మాట్లాడడం లేదు అని దిగులుగా కూర్చుంటే పక్కకు వెళ్లి నవ్వుకునే దాన్ని. అలాగే ఎప్పుడైనా గొడవ జరిగితే మెట్ల కింద దాక్కొని వారికి కనిపించకుండా ఉండేదాన్ని. ఇలాంటి చిలిపి పనులు చిన్నతనంలో ఎన్నొ చేసాను అంటూ రంభ చెప్పుకొచ్చింది.(Rambha )