Rambha: భర్తతో నిజంగానే గొడవ పడ్డా.. విడాకులపై రంభ సంచలనం.?

Rambha: చాలా రోజుల నుండి సీనియర్ హీరోయిన్లకు సంబంధించిన విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అలా సీనియర్ నటి రంభ కూడా తన భర్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ తో విడాకులు తీసుకోబోతుంది అని, వీరిద్దరి మధ్య గొడవలు నిజమే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.
Rambha divorce news
అంతేకాదు రంభ సడన్గా కెనడా నుండి ఇండియాకి వచ్చేసరికి నిజంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని చర్చించుకుంటున్నారు. అయితే రంభ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలవడంతో తాజాగా ఓ టీవీ షోలో జడ్జిగా వచ్చిన రంభ తన విడాకులపై భర్తతో గొడవలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.(Rambha)
Also Read: Kavya Maran: ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో SRH ఓనర్ కావ్య మారన్ డేటింగ్.. త్వరలోనే పెళ్లి.?
రంభ ఆ టీవీ షోలో మాట్లాడుతూ.. అందరి లైఫ్ లో లాగే మా లైఫ్ లో కూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. నేను నా భర్తతో చిన్న గొడవకే లగేజ్ మొత్తం సర్దుకొని కెనడా నుండి ఇండియాకి వచ్చేసాను. అయితే చెన్నైకి వచ్చిన టైంలో మా పేరెంట్స్ కి ఈ విషయం చెప్పడంతో వాళ్లు కూడా భయపడిపోయారు.

ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అంత సెట్ అయిపోయింది అంటూ విడాకులు పర్సనల్ లైఫ్ లో జరిగిన గొడవ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రంభ. ఇక రంభ ఇండియాకి రావడానికి కారణం మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలుస్తోంది.(Rambha)