Ramyakrishna: 22 ఏళ్ల పెళ్లి బంధానికి గుడ్ బై.. భర్తతో రమ్యకృష్ణ విడాకులు.?


Ramyakrishna: ఏంటి రమ్యకృష్ణ కృష్ణవంశీ తమ 22ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నారా.. రమ్యకృష్ణ భర్తకి దూరంగా వెళ్లిపోయిందా.. నిజంగానే రమ్యకృష్ణ కృష్ణ వంశీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే సంచలన నిజం ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా రోజుల నుండి రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్లు వినిపించాయి.

Ramyakrishna divorce with her husband

Ramyakrishna divorce with her husband

ముఖ్యంగా రమ్యకృష్ణ తన కొడుకును తీసుకొని చెన్నైకి వెళ్తున్న సమయంలో కొంతమంది ఫోటోలు తీసి భర్తకు దూరంగా రమ్యకృష్ణ కొడుకుని తీసుకొని చెన్నైకి తీసుకువెళ్లిపోతుందని, ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయని చాలామంది ఫోటోలతో సహా రూమర్లు క్రియేట్ చేశారు.అయితే తాజాగా ఈ రూమర్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు కృష్ణ వంశీ.(Ramyakrishna)

Also Read: Adi Pinishetty: భార్యకి విడాకులు.. ఆది పినిశెట్టి సంచలనం..?

ఆయన మాట్లాడుతూ.. మా 22 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి మేము ఇద్దరం విడాకులు తీసుకుంటున్నామని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మా విడాకుల వార్తలు అస్సలు నిజం కాదు. మేమిద్దరం డివోర్స్ తీసుకున్నట్టు చాలామంది కథలు అల్లేస్తున్నారు. కానీ అవన్నీ రూమర్లు మాత్రమే. రమ్యకృష్ణ తన సినిమాలను పర్సనల్ లైఫ్ ని చాలా బ్యాలెన్సింగ్ చేస్తుంది.

Ramyakrishna divorce with her husband

అందులో ఆమెకి ఆమె సాటి.మేం కూడా అందరిలాగే ఫంక్షన్లకు వెళ్తాము.కానీ వాళ్ళలాగా ఇద్దరం కలిసున్న ఫోటోలు షేర్ చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు.అది పూర్తిగా మా వ్యక్తిగతం. ఇక నేను హైదరాబాదులో ఉంటున్నానంటే అది సినిమాల కోసమే..రమ్యకృష్ణ చెన్నై వెళ్ళింది.. మేము దూరంగా ఉన్నా కూడా కలిసే ఉన్నాం. మేము కూడా సమయం దొరికినప్పుడు కలుసుకుంటూనే ఉంటాం అంటూ కృష్ణవంశీ విడాకుల వార్తలను కొట్టి పారేశారు.(Ramyakrishna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *