Ramyakrishna: ఆ హీరోయిన్ కి వ్యతిరేకంగా రమ్యకృష్ణ మూవీ.?

Ramyakrishna: ఏంటి రమ్యకృష్ణ ఆ స్టార్ హీరోయిన్ కి వ్యతిరేకంగా ఓ సినిమాలో నటించిందా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆమెకు వ్యతిరేకంగా రమ్యకృష్ణ ఎందుకు నటించింది అనేది ఇప్పుడు చూద్దాం. రమ్యకృష్ణ హీరోయిన్ కి వ్యతిరేకంగా నటించిన సినిమా ఏంటయ్యా అంటే..నరసింహ.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా..సౌందర్య హీరోయిన్ గా..నీలాంబరి అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రమ్యకృష్ణ విలన్ గా నటించిన నరసింహ సినిమా అందరూ చూసే ఉంటారు.
Ramyakrishna movie against that heroine
ఈ సినిమాలో రజినీకాంత్ ని పెళ్లి చేసుకోవాలి అనుకొని రమ్యకృష్ణ ఎంతో పొగరు గా ఉండడంతో పాటు కలలు కంటుంది.కానీ రజినీకాంత్ కి మాత్రం రమ్యకృష్ణ నచ్చదు. ఆమె ఇంట్లో పని చేసే పనిమనిషి పాత్రలో నటించిన సౌందర్య నచ్చడంతో ఆమెను పెళ్లి చేసుకుంటారు. దాంతో తన ఇంట్లో పని చేసే పనిమనిషిని పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో రమ్యకృష్ణ చాలా సంవత్సరాలు ఒక రూమ్ లో బందీగా ఉండి రజినీకాంత్ సౌందర్యలపై పగ పెంచుకుంటుంది. (Ramyakrishna)
Also Read: Pawan Kalyan: “రెస్ట్ ఇన్ పీస్” అంటూ పవన్ కళ్యాణ్ కొడుకుపై పోస్ట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.?
అయితే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్ర డైరెక్టర్ కే. ఎస్. రవికుమార్ ఓ హీరోయిన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమాలో చూపించారట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో ఆయనే స్వయంగా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..నేను రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రని జయలలిత గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేశాను.

అయితే ఈ విషయం జయలలిత గారికి కూడా తెలుసు.కానీ జయలలిత గారు ఈ సినిమా చూసి నన్ను అభినందించింది. కానీ ఒక్క మాట కూడా అనలేదు అంటూ కే. ఎస్. రవికుమార్ తెలియజేశారు.అలా రమ్యకృష్ణ జయలలిత గారికి వ్యతిరేకంగా నరసింహ సినిమాలో నటించనట్లు తెలుస్తోంది.(Ramyakrishna)