NTR: నగలతో పారిపోయి వచ్చి ఎన్టీఆర్ తో పెళ్లి..ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా.?

NTR: తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ప్రధాన కారకుడు అన్న ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ కొన్ని వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ అంటే అప్పట్లో చాలామంది అమ్మాయిలు పిచ్చిగా ఇష్టపడేవారు. చేసుకుంటే అలాంటి వ్యక్తిని చేసుకోవాలని భావించేవారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఏకంగా ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకుంటానని తనకున్నటువంటి బంగారం నగలన్నీ సర్దుకుని ఎన్టీఆర్ ఉండే ఆఫీస్ కు వెళ్లిందట.
Ran away with jewellery and got married to NTR
సెక్యూరిటీని తప్పించుకొని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అలాంటి పని కూడా చేసిందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.? ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు. ఇండస్ట్రీలో ఆయన చేయని పాత్ర లేదు. అద్భుతమైన నటనతో వెండితెరని రక్తి కట్టిస్తాడు. అలాంటి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అనూహ్యమైన సంఘటన ఎదురైందట. ఒక అమ్మాయి ఆయనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసిందట. అంతేకాదు ఎన్టీఆర్ ను కలిసిన వెంటనే ఆమె టక్కున ముద్దు కూడా పెట్టిందట..(NTR)
Also Read: ANR: హాస్పిటల్ నర్స్ ని కూడా వదిలి పెట్టని ఏఎన్ఆర్.. ఎవరు లేని టైమ్ లో సరసం!
ఎన్టీఆర్ ఎంతో ప్రేమించే ఆ అమ్మాయి ఆయనను కలవడం కోసం దాదాపు నెలల పాటు వేచి చూసిందట. ఈరోజు ఆయన ఉండే ఆఫీస్ కు వచ్చి తనను కలవాలని సెక్యూరిటీని వేడుకునేదట. కానీ వాళ్లు అనుమతించకపోవడంతో ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ ను కలిసి ఎలాగోలా ఎన్టీఆర్ దగ్గరికి చేరుకుందట.. అమ్మాయి లోపలికి వెళ్లి ఎన్టీఆర్ ను ఊహించుకొని తను రాసిన లెటర్స్ అన్ని ఇచ్చిందట. ఎన్టీఆర్ చదువుతున్న సమయంలో వెంటనే ఆయనకు గట్టిగా ముద్దు పెట్టిందట.. వెంటనే అలర్ట్ అయినటువంటి సెక్యూరిటీ సిబ్బంది లోపలికి పరుగున వచ్చి ఆమె బ్యాగ్ చెక్ చేశారట.

ఇందులో మొత్తం బంగారు నగలు ఉన్నాయట. అప్పట్లోనే వీటి విలువ దాదాపు 8 లక్షలకు పైగానే ఉంటుందట. అయితే ఆ అమ్మాయి ఎన్టీఆర్ పై ప్రేమ పెంచుకొని పెళ్లి చేసుకోకుండా, ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవాలని భావించి ఈ విధంగా నగలతో తన ఇంటి నుంచి బయటకు వచ్చిందట. చివరికి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి నేను నిన్నే చేసుకుంటాను నీతో ఏ పనైనా చేస్తాను అంటూ గట్టిగా చెప్పిందట. విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ అమ్మాయికి సర్ది చెప్పి తన సెక్యూరిటీ ద్వారా తన ఇంటికి పంపించారట.(NTR)