Rana Daggubati: బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రానా దగ్గుబాటి.. ఇంత చెత్త నిర్ణయం ఎలా.?
Rana Daggubati: అప్పుడప్పుడు అనుకోని అవకాశాలు మన తలుపు తడుతూ ఉంటాయి.. అవి అలా వచ్చాయాంటే లక్ష్మీదేవి తలుపు తట్టిందని భావించి తీసుకోవాలి తప్ప వాటిని తిరస్కరిస్తే ఒక్కోసారి చాలా బాధపడాల్సి ఉంటుంది.. అలా సినీ ఫీల్డ్ లో కొంతమంది హీరోల కోసం రాసుకున్న కథలను వారు విని ఏదో ఒక కారణంగా రిజెక్ట్ చేయడం వల్ల మరో హీరోకు ఆ కథ వెళుతుంది. ఆ చిత్రం భారీ హిట్ సాధించినప్పుడు మొదటిసారి రిజెక్ట్ చేసిన హీరోలు ఛీ ఆ సినిమా నేను చేసి ఉంటే బాగుండేది, నా లైఫ్ సెట్ అయ్యేది అంటూ బాధపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి.

Rana Daggubati who missed a golden chance
అలా రానా విషయంలో కూడా అదే జరిగింది.. ఆయన బాహుబలి సినిమాలో నటించకుండా ఈ చిత్రంలో నటించి ఉంటే మాత్రం కెరియర్ మంచి పొజిషన్ లో ఉండేదని అంటుంటారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా పెద్ద హీరోగా ఎదిగారు.. ఈయన కేవలం సినిమాల్లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా నటిస్తూ వస్తున్నారు. అలాంటి రానా బాహుబలి సినిమాలో కీలక పాత్ర పోషించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించారు.. కానీ బాహుబలి సినిమా తర్వాత ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నారట.. (Rana Daggubati)
Also Read: Anil Ravipudi: భార్య చేతిలో అనిల్ రావిపూడి రహస్య వీడియోలు.?
అయితే బాహుబలి సినిమా చేసే సమయంలో అనిల్ రావిపూడి రానా వద్దకు వచ్చి పటాస్ స్టోరీని వినిపించారట. మొత్తం విన్న తర్వాత బాహుబలి సినిమా అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పారట.. నేను అన్ని రోజులు ఆగలేదని అనిల్ రావిపూడి ఈ కథని కళ్యాణ్ రామ్ కు వినిపించారట. వెంటనే కళ్యాణ్ రామ్ ఓకే చెప్పడం, ఆయన సొంత బ్యానర్ లోనే సినిమా షూటింగ్ సెట్లోకి వెళ్లడం జరిగాయి.. అంతేకాకుండా ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించడంతో కళ్యాణ్ రామ్ కెరియర్ గాడిలో పడింది..ఇక బాహుబలి సినిమాలో చేసిన రానా ఈ మూవీ కోసం తన బాడీని ఎంతో మార్చుకున్నారు..

ఎన్నో మందులు వాడి సినిమా షూటింగ్ అయ్యేవరకు మైంటైన్ చేస్తూ వచ్చారు. సినిమా భారీ హిట్ అయింది, కానీ రానాకు విలన్ గానే పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత రానా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ సినిమాలను కూడా తగ్గించేసాడు. ఒకవేళ అనిల్ రావిపూడి సినిమాలో నటించి ఉంటే ఈ విధమైన సమస్యలు వచ్చి ఉండేవి కావు మంచి పొజిషన్ కు వెళ్లి ఉండేవారు అంటూ దగ్గుబాటి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Rana Daggubati)