Ranbir Kapoor:అలియా కంటే ముందే రణబీర్ కపూర్ పెళ్లి.. ఫస్ట్ వైఫ్ ని ఎప్పటికైనా కలుస్తా అంటూ.?

Ranbir Kapoor: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లు ఇతర నటీనటులకు అభిమానులు ఉంటారు. అయితే కొంతమందికి అభిమానం అనేది మరి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి అభిమాన హీరోను లేదా హీరోయిన్ పై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తారు.. ఆ విధంగానే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ పై కూడా ఒక లేడీ ఫ్యాన్ తన ప్రేమను చూపించింది. అయితే అది కామన్ గా అందరు చూపించేట్టు చూపిస్తే పర్లేదు.
Ranbir Kapoor got married before Alia
కానీ ఆమె ప్రేమ మరింత పెరిగిపోయి చివరికి రణ్బీర్ కపూర్ గాలి తాకిన చాలు అనుకొని, తన ఇంటి ముందు గేటుకు బొట్టుపెట్టి పూలదండ వేసి పెళ్లి చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే సాధారణంగా చాలామంది అభిమానులు వారి అభిమాన హీరో, హీరోయిన్ ఫోటోలను పచ్చబొట్టు లాగా వేయించుకుంటారు. కొంతమంది వారి వాహనాలపై ఫోటోలను అంటించుకుంటారు. (Ranbir Kapoor)
Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోతే భార్య కూడా పక్కన లేదు.. అన్ని నేనే అయ్యా..?
లేదంటే వారుంటున్న ఇంట్లో వారి ఫోటోలను పెట్టుకుని ఆరాధిస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం రన్బీర్ కపూర్ పై ఉన్న ప్రేమతో ఆయనను కలవలేక చివరికి తన ఇంటి గేటు దగ్గరికి వచ్చి దానికి బొట్టు పెట్టి పూలదండ వేసి తాళిబొట్టు కూడా కట్టించుకొని ఇక రన్బీర్ కపూర్ తో పెళ్లయిపోయిందని చెప్పి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని రణబీర్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఆమె నన్ను మొదటి భార్యా అని చెప్పుకొచ్చారు..అయితే రన్బీర్ కపూర్ ఇంట్లో లేని సమయంలో ఆ అమ్మాయి తన ఇంటి గేటు వద్దకు వచ్చిందట.

తాను ఇంట్లో లేదని వాచ్మెన్ చెప్పడంతో ఆ గేటుకు బొట్టు పెట్టి, పండితునితో మంత్రాలు చదివిస్తూ పెళ్లి కూడా చేసుకొని, నాకు రణవీర్ తో పెళ్లి అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయిందట. ఈ విషయాన్ని రన్బీర్ ఇంటికి వచ్చిన సమయంలో వాచ్మెన్ చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయానని ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నాపై ఇంత అభిమానం చూపే అమ్మాయిని, నేను ఇంతవరకు కలవలేదని ఆమె నా మొదటి భార్య అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Ranbir Kapoor)