Ram Charan RC16: నిరాశ లో మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్ సినిమా రూమర్ మాత్రమే!!
Ram Charan RC16: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “RC16” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
Ranbir Kapoor not part of Ram Charan RC16
“ఆర్ సి 16″లో రణ్ బీర్ కపూర్ నటించలేదని సమాచారం. అయితే, చిత్ర కథ ప్రకారం ఐదు నిమిషాల నిడివి గల ఒక స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోని ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా, ఎవరి పేరు ఫైనల్ చేయలేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా, “యానిమల్” సినిమాతో విలన్‌గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
“ఆర్ సి 16” సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ జంట ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించడంతో, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా రాణించాలనే అంచనాలు ఉన్నాయ్.