Virat Kohli: రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. విరాట్‌ కోహ్లీకి ఎంత జీతం వస్తుంది ?

Virat Kohli: స్టార్ ఇండియన్ బ్యాటర్, విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే. 2024-25 సీజన్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌తో ఢిల్లీ తరపున ఆడాడు కోహ్లీ. ఇక ఈ మైదానంలో కోహ్లీ ఆడుతున్న తరుణంలోనే… వేలాది ప్రేక్షకులు వచ్చారు. ఇలాంటి తరుణంలోనే… రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. విరాట్‌ కోహ్లీకి ఎంత జీతం వస్తుంది అనే చర్చ జరుగుతోంది.

Ranji Trophy 2024-25 How much will Virat Kohli earn

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రకారం… గ్రేడ్ A+ కాంట్రాక్ట్ ప్లేయర్ అయిన కోహ్లి…. ప్రతి టెస్ట్ మ్యాచ్‌కి INR 15 లక్షలు సంపాదిస్తాడు. దీంతో పాటు జాతీయ విధుల నుంచి సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు కోహ్లీ. అలాగే… అదనంగా, ఎండార్స్‌మెంట్‌లు మరియు IPL కాంట్రాక్ట్‌ల ద్వారా గణనీయమైన మొత్తాన్ని అందుకుంటాడు కోహ్లీ. అయినప్పటికీ, దేశీయ క్రికెట్ ఆడితే… కోహ్లీకి తక్కువే జీతం వస్తుంది.

BCCI దేశీయ చెల్లింపు విధానం ప్రకారం,

40 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు రోజుకు INR 60,000 సంపాదిస్తారు.
21-40 మ్యాచ్‌లు ఉన్న ఆటగాళ్లు రోజుకు INR 50,000 సంపాదిస్తారు.
20 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఒక్కో ఆటకు రోజుకు INR 40,000 సంపాదిస్తారు.
నాన్-ప్లేయింగ్ స్క్వాడ్ సభ్యులు వారి అనుభవాన్ని బట్టి INR 20,000 నుంచి 30,000 మధ్య సంపాదిస్తారు.

KCR Criticizes Congress: కేసీఆర్ ఆగ్రహం.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పథకాలు గంగలో కలిశాయా?

ఇక విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. అంటే కోహ్లీ రోజుకు 60,000 రూపాయల జీతం వస్తుందన్న మాట. అంటే రైల్వేస్‌తో పూర్తి మ్యాచ్ ఆడినందుకు మొత్తం INR 2,40,000 తీసుకుంటాడు. కాగా టెస్ట్ మ్యాచ్‌ల మాదిరిగా కాకుండా, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కేవలం నాలుగు రోజులు మాత్రమే జరుగుతాయి. అందుకే కోహ్లీకి మొత్తం INR 2,40,000 వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *