Rashmika: 25 కోట్లతో పాటు రేవతి భర్తతో రష్మికకు పెళ్లి.. నెటిజన్ వింత డిమాండ్..?
Rashmika: సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కామెంట్లు, పోస్టులు చూస్తూ ఉంటే చాలా వింతగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా సంధ్యా థియేటర్ ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి..ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ పై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో పుష్ప టు మూవీకి అల్లు అర్జున్క కి సపోర్ట్ గా ఉంటే మరికొంత మందేమో చనిపోయిన రేవతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నారు.
Rashmika marriage with Revathi husband Netizen strange demand.
అయితే ఇందులో అల్లు అర్జున్ తప్పు ముమ్మాటికీ ఉంది.ఎందుకంటే ఆయన పోలీసులు వద్దని వారించినప్పుడు అక్కడికి రాకుండా ఉండాల్సింది. కానీ ఆయన వచ్చేసరికి అభిమానుల తాకిడి ఎక్కువ అవ్వడంతో ఆ ఘటన జరిగింది.అయితే ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కానీ ఇందులో పూర్తిగా బన్నీ తప్పయితే లేదు. అయితే ఈ విషయంలో బన్నీని కొంతమంది వెనకేసుకు వస్తే మరికొంతమంది తిడుతున్నారు.(Rashmika)
Also Read: Pawan Kalyan: తెలుగు సినిమా ఏపీ కి తరలిపోతుందా.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్!!
ఇక కొంత మంది నెటిజన్స్ అయితే ఈ ఘటన జరిగాక బన్నీపై ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఇక వాళ్ళు ఎవరో మీరే అర్థం చేసుకోవచ్చు. బన్నీ అంటే పడని చాలామంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. అదేంటంటే చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 25 కోట్లు ఇవ్వాల్సిందే.
25 కోట్లు ఇస్తేనే వారి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అలాగే రేవతి భర్తకు న్యాయం జరగాలంటే రేవతి భర్తకి రష్మికనే ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ వింతగా డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ నెట్టింట వైరల్ అవ్వడంతో జనాలు ఇలా కూడా ఆలోచిస్తారా అంటూ ఈ కామెంట్ చదివి కొంతమంది నవ్వుకుంటుంటే మరికొంతమందేమో విమర్శలు చేస్తున్నారు.(Rashmika)