Rashmika: లైవ్ లో మహేష్ బాబుని అవమానించిన రష్మిక.. ఫ్యాన్స్ ట్రోల్స్.?
Rashmika: చాలా మంది సెలబ్రిటీలు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో మాట్లాడే కొన్ని మాటల వల్ల అప్పుడప్పుడు వివాదాల పాలవుతూ ఉంటారు.ఇక వీళ్లు తెలిసి తెలియక మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరలై ట్రోల్స్ కి గురవుతారు. అయితే తాజాగా రష్మిక మాట్లాడిన మాటలు కూడా ట్రోల్స్ కి దారి తీసాయి.మరి ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి.. ఆమె ఏం మాట్లాడడం వల్ల ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
Rashmika who insulted Mahesh Babu
చిన్న హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇండియా మొత్తం గుర్తించే హీరోయిన్గా మారిపోయిన రష్మిక సినీ ఇండస్ట్రీ సక్సెస్ మామూలుగా లేదు. ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి విజయ్ దళపతి అంటే చెప్పలేనంత ఇష్టమట. ఆయన నటించిన సినిమాలను ఎక్కువగా చూస్తుందట. ఇక ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు విజయ్ నటించిన గిల్లి మూవీ అంటే చెప్పలేనంత ఇష్టం.( Rashmika)
Also Read: Bunny: రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీకి టార్చర్.. బన్నీ జాతక సీక్రెట్ చెప్పిన జ్యోతిష్యుడు.?
ఈ సినిమాలోని అప్పుడి పోడే పోడే అనే పాటకి చెప్పలేనన్నిసార్లు డాన్స్ చేశాను.అంతేకాదు గిల్లి సినిమా పోకిరి సినిమాకి రీమేక్ అనే విషయం కూడా నాకు తెలియదు.నేను చూసిన మొదటి సినిమా కూడా గిల్లి అంటూ రష్మిక చెప్పు కొచ్చింది. అయితే రష్మిక మాట్లాడిన తప్పేంటంటే గిల్లి మూవీ మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ కి రీమేక్ కాదు. ఎందుకంటే గిల్లి మూవీ మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీకి రీమేక్.పోకిరి సినిమాని తమిళంలో పోకిరి అనే పేరుతోనే రీమేక్ చేశారు.
కానీ రష్మిక మర్చిపోయి గిల్లి సినిమా పోకిరి సినిమాకి రిమేక్ అని చెప్పడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈ ట్రోల్స్ ని రష్మిక కి ట్యాగ్ చేయడంతో తప్పు తెలుసుకున్న రష్మిక సారీ నాక్కూడా ఈ విషయం తెలియదు.నేను ఇంటర్వ్యూ అయిపోయాక ఆలోచించాను.అది ఒక్కడు సినిమా రిమేక్ కదా పోకిరి కాదు కదా అని అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన మహేష్ బాబు ఫ్యాన్స్ మా హీరోనే రష్మిక అవమానిస్తుందా.. పోకిరి సినిమాకి ఒక్కడు సినిమాకి తేడా తెలియదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.( Rashmika)