Rashmika: ప్లాన్ చేసి మరీ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసిన రష్మిక..ఈ టాలెంట్ కూడా ఉందా.?
Rashmika: ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా నటిస్తూ పారితోషకం కూడా అందుకుంటున్నారు.. ఒక్కోసారి హీరోయిన్లను బేస్ చేసుకుని సినిమాలు హిట్లు కూడా అవుతున్నాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందాన. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాల కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..

Rashmika who planned and kidnapped the director
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మను నేషనల్ క్రష్ అంటూ ముద్దుగా పిలుస్తారు.. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్, దేశంలోని చాలా ఇండస్ట్రీలలో పెద్ద పెద్ద స్టార్లతో జతకడుతోంది.. ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమా చేసిన అది సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దర్శక నిర్మాతలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఈమె ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. (Rashmika)
Also Read: Chiranjeevi: ఆయనో ఎర్రి మొహం.. చిరంజీవి పై ట్రోల్స్..?
అలాంటి రష్మిక తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చావా’ ఫిబ్రవరి 14వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ చేయగా ఇందులో విక్కీ కౌశల్ హీరోగా చేస్తున్నారు.. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ డేటు ఇంకా రెండు రోజులే ఉండడంతో ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.. ఇందులో దర్శకుడు , హీరోతో దిగిన కొన్ని ఫోటోలను పంచుకుంది..

ఈ సందర్భంగా ఆమె ఎలా రాసుకోచ్చింది” లక్ష్మణ్ సార్ ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయనను ఎలాగైనా బయటకు తీసుకురావాలని నేను విక్కీ కలిసి కిడ్నాప్ చేసి ఒక చిన్న ఫోటో షూట్ చేస్తున్నాం.. ఇంకా కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది మాకు చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంది.. అందుకే డైరెక్టర్ ను కిడ్నాప్ చేశామని రష్మిక రాసుకొచ్చింది. ఈ విధంగా సినిమా రిలీజ్ కి ముందు రష్మిక ఇలా పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.(Rashmika)
https://www.instagram.com/p/DF7a-1UISwI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==