ratan tata 2

Ratan Tata: భారతదేశ పారిశ్రామిక రంగానికి అద్భుతమైన దిశానిర్దేశం చేసిన దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా, 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్‌ను గ్లోబల్ వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఆయన చేసిన సేవలు, భారత పారిశ్రామిక రంగంలో వేరు ప్రదేశాన్ని సొంతం చేసుకున్నాయి. ఆయన తాత్కాలికంగా 2016-17లో కూడా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా తన నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు.

Ratan Tata: Leadership Journey and Contributions to Business

“గుండుసూది నుంచి విమానాల వరకు” అన్నట్లుగా, రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ విస్తరించి, దేశ పారిశ్రామిక రంగానికి మార్గదర్శకంగా నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి సంస్థలను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే కాకుండా, టాటా బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చారు. రతన్ టాటా విశ్వదార్శనికతకు నిదర్శనంగా ఆయన చేసిన అనేక ఆవిష్కరణలు, పలు వ్యాపార రంగాలను శాసించాయి. “పట్టుదల కలిగిన వ్యక్తి చెయ్యగలిగేది ప్రపంచాన్ని మార్చడం” అన్న చర్చిల్ మాటలు రతన్ టాటా వంటి వ్యక్తులకు సరిగ్గా సరిపోతాయి.

Also Read: Green Chickpeas: ఈ పచ్చి శనగలు తింటున్నారా.. అయితే.. జాగ్రత్త ?

పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా, 2008లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఇది ఆయన ప్రతిభను, అతని దేశ సేవను గౌరవించిన అనేక పురస్కారాల్లో ఒకటి మాత్రమే. ఆయన చేసిన సేవలు, భవిష్యత్తులో కూడా కొత్త తరం వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

వ్యాపారంలో విజయం సాధించిన వ్యక్తిగా మాత్రమే కాకుండా, రతన్ టాటా ఒక దార్శనికుడుగా, సమాజ సేవకుడిగా కూడా తన పేరు నిలబెట్టుకున్నారు. సామాజిక బాధ్యతలపై ఆయన చూపిన శ్రద్ధ, టాటా ట్రస్ట్స్ ద్వారా విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో చేసిన కృషి, భారతదేశానికి అద్భుతమైన వారసత్వం. ఆయన మనందరికీ చూపిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా ఉంటుంది.