Ration Card: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు.. పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం!!

Ration Card: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎప్పుడు అందజేస్తారో తెలియక నిరాశకు గురవుతున్నారు. మాదాపూర్, కోఠి, చర్లపల్లి వంటి ప్రాంతాల్లో కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని సమాచారం వచ్చినా, ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Ration Card Distribution Date Still Unclear
ప్రభుత్వం మార్చి 1న పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, ఇంకా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, ఇతర నగర ప్రాంతాల్లో మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ కార్డుల ద్వారా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందతారనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్న సమయానికి పంపిణీ చేపట్టకపోవడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబడుతున్నా, వాటి పరిశీలన, మంజూరు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటికే అనేక మంది తమ దరఖాస్తు ఆమోదించబడిందని మెసేజ్‌లు పొందినప్పటికీ, కార్డులు అందుబాటులోకి రావడం లేదు.
ప్రజలు కార్డులు ఎప్పుడు అందుతాయనే విషయంపై స్పష్టత కోరుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని పంపిణీ ప్రారంభిస్తే, ఈ అస్పష్టత వీడటమే కాకుండా, నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం కలుగుతుంది.